logo

చెట్ పట్‌లో ఏడాది చివర్లో మెట్రో భూగర్భ పనులు

చెట్‌పట్‌లో మెట్రో భూగర్భ మార్గ పనులు ఈ ఏడాది చివరికి ప్రారంభం కానున్నాయి. టన్నల్‌ బోరింగ్‌ మెషిన్‌ (టీబీఎం) భూగర్భంలో దింపేందుకు కావలసిన ఇతరత్రా పనులు జరుగుతున్నాయి.

Updated : 02 Jun 2023 05:53 IST

వడపళని, న్యూస్‌టుడే: చెట్‌పట్‌లో మెట్రో భూగర్భ మార్గ పనులు ఈ ఏడాది చివరికి ప్రారంభం కానున్నాయి. టన్నల్‌ బోరింగ్‌ మెషిన్‌ (టీబీఎం) భూగర్భంలో దింపేందుకు కావలసిన ఇతరత్రా పనులు జరుగుతున్నాయి. మాధవరం మిల్క్‌ కాలనీ నుంచి సిరుసేరి సిప్కాట్ వరకున్న 45.8 కి.మీ మార్గంలో ఇది మూడో మార్గం కానుంది. ఈ పనులు పూర్తవడానికి ఆరు నెలల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. 2026 నుంచి 2028 వరకు ఈ మార్గంలో రెండో దశ పనులు విడతల వారీగా పూర్తి చేస్తామని సీఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎంఏ సిద్ధిక్‌ పేర్కొన్నారు. చెట్పట్లో 22 మీటర్ల లోతులో పనులు జరగనున్నాయి. టీబీఎం సాయంతో కేఎంసీ మెట్రో స్టేషను సమీపంలో ఉన్న కీల్పాక్‌ వైద్య కళాశాల వద్ద 29 మీటర్ల లోతులో పనులు ప్రారంభిస్తారు. 838 మీటర్ల దూరంలో రెండు స్టేషన్లు రానున్నాయి. ఈ వారం మొదట్లో ఇంజినీర్లు టీబీఎంను అసెంబుల్‌ చేయడం ప్రారంభించారు. జులైలో చెట్పట్ మెట్రో నుంచి స్టెర్లింగ్‌ రోడ్డు జంక్షన్‌ మెట్రో వరకు భూగర్భ పనులు జరుగుతాయి. మూడో మార్గంలో మాధవరం మిల్క్‌ కాలనీ నుంచి చెట్పట్, నుంగంబాక్కరం, మైలాపూరు, అడయార్‌ల మీదుగా ఓల్డ్‌ మహాబలిపురం రోడ్డును అనుసంధానిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని