బాలుడిపై వృద్ధుడి లైంగిక వేధింపులు
బాలుడిని లైంగిక వేధింపులకు గురిచేసిన 72 ఏళ్ల వృద్ధుడిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... చెన్నై కొళత్తూర్‌లో ప్రైవేటు చైల్డ్ వెల్ఫేర్ హోం నడుస్తోంది.
ప్యారిస్, న్యూస్‌టుడే: బాలుడిని లైంగిక వేధింపులకు గురిచేసిన 72 ఏళ్ల వృద్ధుడిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... చెన్నై కొళత్తూర్‌లో ప్రైవేటు చైల్డ్ వెల్ఫేర్ హోం నడుస్తోంది. దీని యజమాని అగస్టీన్ (72) విశ్రాంత ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. ప్రభుత్వ ఆమోదం పొందిన ఈ హోంలో తల్లిదండ్రులు లేని 5-14 ఏళ్ల మధ్య వయస్కులైన పదిహేను మంది బాలురు ఉన్నారు. ఓ బాలుడు (13) కొన్ని రోజుల ముందు చైల్డ్ హెల్ప్ లైన్ నెంబరుకి ఫోన్ చేసి అగస్టీన్ తనను లైంగిక వేధింపులకి గురిచేస్తున్నట్లు తెలిపాడు. ఈ విషయమై అధికారులు హోంకి వెళ్లి పరిశీలించారు. విల్లివాక్కం పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి, అతడిని అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bombay HC: ఔషధాల కొరతతో మరణాలా..? ఆసుపత్రుల్లో మృత్యుఘోషపై బాంబే హైకోర్టు సీరియస్
-
Anitha: అప్పుడు నష్టాలు చూశా.. ఒత్తిడికి లోనయ్యా: అనితా చౌదరి
-
Pawan Kalyan: జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం: పవన్ కల్యాణ్
-
Karnataka: ఇలాగే వదిలేస్తే కర్ణాటకలో కసబ్, లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తారు: భాజపా నేత సీటీ రవి
-
Asian Games: ఆసియా క్రీడలు.. నీరజ్‌కు స్వర్ణం, కిశోర్‌కు రజతం
-
Chandrababu Arrest: ఆంక్షలు దాటి, పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి