logo

సిబ్బందిని విమానంలో తీసుకెళ్లిన వ్యాపారి

తన వద్ద పనిచేసే సిబ్బందిని ఓ వ్యాపారి విమానంలో చెన్నై తీసుకెళ్లాడు. మదురై వద్ద ఉన్న సొక్కనూర్‌కి చెందిన మాయన్‌ నిర్మాణ పనులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి.

Updated : 03 Feb 2024 09:29 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: తన వద్ద పనిచేసే సిబ్బందిని ఓ వ్యాపారి విమానంలో చెన్నై తీసుకెళ్లాడు. మదురై వద్ద ఉన్న సొక్కనూర్‌కి చెందిన మాయన్‌ నిర్మాణ పనులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. దివంగత నటుడు విజయకాంత్‌ అభిమాని. ఆయన వద్ద పెద్దసంఖ్యలో సిబ్బంది, ఇంజినీర్లు పనిచేస్తుంటారు. విజయ్‌కాంత్‌ మార్గంలోనే తన వద్ద పనిచేసే ఉద్యోగులను ప్రోత్సహించేలా ఏటా ప్రత్యేక బహుమతులతో పాటు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు. అభిమాన నటుడు విజయకాంత్‌ స్మారకాన్ని చేసేందుకు 35 మంది మహిళలు, 40 మంది పురుషులను మదురై నుంచి చెన్నైకి విమానంలో తీసుకెళ్లారు. ఆయన మాట్లాడుతూ తనకు 2002లో మొదటిసారిగా విమానంలో ప్రయాణించే అవకాశం దక్కిందని, ఈ అనుభూతి తన వద్ద పనిచేసే వారికి కూడా ఇవ్వాలనుకున్నానని తెలిపారు. అందుకే వారిని విమానంలో చెన్నై తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. మెరీనా బీచ్‌, మహాబలిపురం తదితర ప్రాంతాలకు కూడా తీసుకెళ్లినట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని