logo

వైభవంగా దర్శకుడు శంకర్‌ కుమార్తె వివాహం

భారీచిత్రాల దర్శకుడు శంకర్‌ కుమార్తె ఐశ్వర్య-తరుణ్‌ కార్తికేయన్‌ వివాహం చెన్నైలోని ఆర్కే కన్వెన్షన్‌లో సోమవారం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఆయన సతీమణి దుర్గా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.

Published : 16 Apr 2024 00:59 IST

వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి స్టాలిన్‌ దంపతులు

చెన్నై, న్యూస్‌టుడే: భారీచిత్రాల దర్శకుడు శంకర్‌ కుమార్తె ఐశ్వర్య-తరుణ్‌ కార్తికేయన్‌ వివాహం చెన్నైలోని ఆర్కే కన్వెన్షన్‌లో సోమవారం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఆయన సతీమణి దుర్గా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. అగ్రతారలు రజనీకాంత్‌, కమలహాసన్‌, సూర్య-జ్యోతిక దంపతులు, కార్తి, విక్రమ్‌, విశాల్‌, అర్జున్‌, నళిని, దర్శకులు భారతిరాజా, మణిరత్నం-సుహాసిని దంపతులు, కె.భాగ్యరాజ్‌, పి.వాసు, కేఎస్‌ రవికుమార్‌, అట్లీ, హరి, విష్ణువర్థన్‌, విఘ్నేశ్‌ శివన్‌-నయనతార దంపతులు, సంగీత దర్శకుడు హారిస్‌ జయరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. ఐశ్వర్యకు ఇది రెండో వివాహం. 2022లో పుదుచ్చేరి క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌తో పెళ్లి జరిగింది. బాలికను లైంగికంగా వేధించినట్లు పోక్సో కింద అరెస్టవగా ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ఫిబ్రవరిలో సహాయ దర్శకుడు తరుణ్‌ కార్తికేయన్‌తో రెండోపెళ్లికి నిశ్చితార్థం జరిగింది. శంకర్‌ వద్ద తరుణ్‌ కార్తికేయన్‌ సహాయ దర్శకుడిగా ఉన్నారు. ఐశ్వర్యతో పాటు శంకర్‌కు అతిథి అనే కుమార్తె ఉంది. వైద్యవిద్య అభ్యసించిన ఆమె సినిమాపై ఆసక్తితో ‘విరుమన్‌’ ద్వారా కోలీవుడ్‌కు నటిగా పరిచయమయ్యారు. ఎన్నికల బిజీలోనూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్వయంగా వివాహ వేడుకలకు హాజరుకావడంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

రజనీకాంత్‌, కమలహాసన్‌, సూర్య, విక్రమ్‌, నయనతార, విఘ్నేశ్‌ శివన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని