logo

గోట్‌ ఫస్ట్‌ సింగిల్‌ వైరల్‌

వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న ‘గోట్‌’ చిత్రం తాజా సమాచారంపై విజయ్‌ అభిమానులు, తమిళ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Published : 16 Apr 2024 01:03 IST

చెన్నై, న్యూస్‌టుడే: వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న ‘గోట్‌’ చిత్రం తాజా సమాచారంపై విజయ్‌ అభిమానులు, తమిళ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘విజిల్‌ పోడు’ శీర్షికతో ఫస్ట్‌ సింగిల్‌ను ఆదివారం విడుదల చేశారు. యువన్‌ శంకర్‌రాజా సంగీత దర్శకత్వంలో మదన్‌ కార్కి రాసిన ఈ పాటను విజయ్‌ ఆలపించారు. పాట లిరిక్‌ వీడియో యూట్యూబ్‌లో విడుదలైంది. ‘పార్టీ ఒన్ను తొడంగట్టుమా?.. ’ అనే ఆ పాట విజయ్‌ రాజకీయ ప్రవేశ సన్నాహాలకు సంబంధించినదిగా నెటిజన్లు భావిస్తున్నారు. వీడియో చివర్లో విజయ్‌, ప్రభుదేవా, ప్రశాంత్‌, అజ్మల్‌ వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి.


రాయన్‌ పోస్టర్‌ విడుదల

‘రాయన్‌’ పోస్టర్‌

చెన్నై, న్యూస్‌టుడే: స్వీయ దర్శకత్వంలో ధనుష్‌ నటిస్తున్న చిత్రం ‘రాయన్‌’. ధనుష్‌కి ఇది 50వ చిత్రం. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. తుషారా విజయన్‌, సందీప్‌ కిషన్‌, కాళిదాస్‌ జయరామ్‌, ఎస్‌.జె.సూర్య, అపర్ణ బాలమురళీ తదితరులు ఇతర నటీనటులు. చిత్రీకరణ పనులు డిసెంబరులో ముగిసినట్లు ఎక్స్‌ పేజీలో ధనుష్‌ వెల్లడించారు. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ విడుదలైన నేపథ్యంలో తమిళ సంవత్సరాది సందర్భంగా ఆదివారం పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ధనుష్‌ వైవిధ్యమైన గెటప్‌లో కనిపించారు. చిత్రం ఫస్ట్‌ సింగిల్‌ త్వరలో విడుదల కానుంది.


డిస్నీ హాట్‌స్టార్‌లో సైరన్‌

‘సైరన్‌’ పోస్టర్‌

చెన్నై, న్యూస్‌టుడే: వర్ధమాన దర్శకుడు ఆంథోని భాగ్యరాజ్‌ దర్శకత్వంలో జయం రవి నటించిన ‘సైరన్‌’ ఫిబ్రవరి 16న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో 19న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని