logo

జీఎస్టీతో జౌళి వ్యాపారం కుదేలు

అగ్రస్థానంలో ఉన్న తిరుప్పూర్‌ జౌళి వ్యాపారం జీఎస్టీ కారణంగా ప్రస్తుతం వెనుకబడిందని నటుడు, ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ తెలిపారు. తిరుప్పూర్‌లో సీపీఐ అభ్యర్థి సుబ్బరాయన్‌కు మద్దతుగా ఆదివారం రాత్రి ప్రచారం చేశారు.

Published : 16 Apr 2024 01:05 IST

ప్రచారం చేస్తున్న కమల్‌హాసన్‌

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: అగ్రస్థానంలో ఉన్న తిరుప్పూర్‌ జౌళి వ్యాపారం జీఎస్టీ కారణంగా ప్రస్తుతం వెనుకబడిందని నటుడు, ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ తెలిపారు. తిరుప్పూర్‌లో సీపీఐ అభ్యర్థి సుబ్బరాయన్‌కు మద్దతుగా ఆదివారం రాత్రి ప్రచారం చేశారు. గాంధీ మన దస్తులు మనమే తయారుచేసుకోవాలన్నారని, ఆయన మాటలు పూర్తిగా పాటించిది తిరుప్పూర్‌ అన్నారు. జీఎస్టీ, పెట్రోల్‌ ధరల పెంపు తదితర వాటితో వ్యాపారంలో నష్టం ఏర్పడిందన్నారు. ఏడాదికి రూ.40వేల కోట్ల వ్యాపారం జరుగుతోందన్నారు. తిరుప్పూర్‌లా 70 వ్యాపార నగరాలను సృష్టిస్తామని కేంద్రమంత్రి అంటున్నారన్నారు. తిరుప్పూర్‌నే సరిగ్గా పట్టించుకోని మీరు అన్ని నగరాలు ఎలా సృష్టిస్తారని ప్రశ్నించారు. రెండుసార్లు ఎంపీ, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న సుబ్బరాయన్‌ ప్రజాక్షేమం కోసం 19ఏళ్ల ప్రాయం నుంచే పోరాడుతున్నారని గుర్తు చేశారు. దేశంలో జీఎస్టీ తీసుకొచ్చేటప్పుడు చిత్రసీమలో మొదట వ్యతిరేకత తెలిపింది తానేనన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని