logo

ఓటు హక్కు సద్వినియోగం చేసుకోండి

తిరుచ్చి శ్రీరంగంలోని మేల చింతామణి, మాంబలసాలైని అనుసంధానం చేసే కావేరి వంతెనపై అందరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని పెయింటింగ్‌తో అవగాహన కల్పించారు.

Published : 16 Apr 2024 01:09 IST

కావేరి వంతెనపై నినాదాలు

వడపళని, ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: తిరుచ్చి శ్రీరంగంలోని మేల చింతామణి, మాంబలసాలైని అనుసంధానం చేసే కావేరి వంతెనపై అందరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని పెయింటింగ్‌తో అవగాహన కల్పించారు. ఇందుకోసం 80 మంది కళాకారులు, 90 మంది పెయింటర్లు శ్రమించారు. 540 మీటర్ల పొడవున్న వంతెనపై శనివారం రాత్రి 10 గంటల నుంచి వాహనాల రాకపోకలు అనుమతించలేదు. తిరుచ్చి, తంజావూరు, అరియలూరు నుంచి కళాకారులు, పెయింటర్లు తరలివచ్చారు. తెలుపు, పసుపు రంగులతో సందేశాలు రాశారు. వందశాతం ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎన్నికల ఉత్సవం.. దేశ పండుగ తదితర నినాదాలు రాశారు. వాహనాలు సంచరిస్తున్నా పది రోజుల పాటు దెబ్బతినదని ఆర్టిస్టు జయరాజ్‌ పేర్కొన్నాడు. తిరుచ్చి కలెక్టరు ఎం.ప్రదీప్‌ కుమార్‌.. ఎస్‌వీఈఈపీ వాలంటీర్ల సేవలపై హర్షం వ్యక్తం చేశారు. తమిళం, ఇంగ్లిష్‌లో రాసిన అక్షరాలను డ్రోన్‌ కెమెరాల్లో కూడా బంధించారు. మక్కల్‌ శక్తి ఇయక్కం సభ్యులు మొదటిసారి ఓటు వేస్తున్న వారికి పొన్‌మలై రైల్వే మైదానంలో ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని