logo

సముద్రంలో జాలర్లపై దాడి

సముద్రంలో చేపలు పడుతున్న ముగ్గురు మత్స్యకారులపై శ్రీలంక సముద్ర దోపిడీదారులు దాడికి పాల్పడిన ఘటన నాగపట్టిణంలో చోటుచేసుకుంంది.

Published : 01 May 2024 01:22 IST

గాయపడిన మత్స్యకారులు

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: సముద్రంలో చేపలు పడుతున్న ముగ్గురు మత్స్యకారులపై శ్రీలంక సముద్ర దోపిడీదారులు దాడికి పాల్పడిన ఘటన నాగపట్టిణంలో చోటుచేసుకుంంది. వేలాంగన్ని సమీపంలోని సెరుదూర్‌ మత్స్యకార గ్రామం నుంచి మురుగన్‌ అనే వ్యక్తికి సొంతమైన పడవలో మురుగన్‌, లింగం, ముత్తుచిన్నయన్‌ సముద్రంలోకి వెళ్లారు. మంగళవారం 20 మైళ్ల దూరంలో చేపలు పడుతుండగా ఆ సమయంలో అక్కడికొచ్చిన ముగ్గురు చేతిలో ఉన్న కర్రలతో దాడి చేశారు. వారి పడవలో ఉన్న జీపీఎస్‌, వాకీటాకీ, వలలు, 40కిలోల చేపలు దోచుకెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన మత్స్యకారులు ఒడ్డుకు చేరుకోగా అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడుల నుంచి కోస్ట్‌గార్డ్‌ పోలీసులు, భారత నావికాదళం కాపాడాలని జాలర్లు విన్నవించారు.

టీఎంసీ ఖండన..

వేళచ్చేరి: తమిళ మత్స్యకారులపై దాడిని ఖండిస్తున్నామని టీఎంసీ అధ్యక్షుడు జీకే వాసన్‌ పేర్కొన్నారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో.. సోమవారం రాత్రి నాగై జిల్లాకు చెందిన జాలర్లు పడవల్లో కరోడియక్కరై వద్ద నడి సముద్రంలో చేపల వేట కొనసాగిస్తుండగా అక్కడికి వచ్చిన శ్రీలంకకు చెందిన సముద్రపు దొంగలు మారాణాయుధాలతో దాడి జరపడంతో తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. శ్రీలంక సముద్రపు దొంగల చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖండిచాలని కోరారు. మత్స్యకారుల జీవనాధారమైన చేపలవేట కాపాడటానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని