logo

ఉత్సాహంగా పడవల పోటీ

సంక్రాంతి సంబరాల్లో భాగంగా బంగారమ్మపాలెంలో మత్స్యకారులు పడవ (పుట్టీ) పోటీలు నిర్వహించారు. వరాహ నది మొగలో నిర్వహించిన ఈ పోటీలు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి

Published : 15 Jan 2022 05:03 IST

పోటీల్లో పాల్గొన్న మత్స్యకారులు

సంక్రాంతి సంబరాల్లో భాగంగా బంగారమ్మపాలెంలో మత్స్యకారులు పడవ (పుట్టీ) పోటీలు నిర్వహించారు. వరాహ నది మొగలో నిర్వహించిన ఈ పోటీలు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. తీర ప్రాంతాలైన పది గ్రామాలకు చెందిన మత్స్యకారులు పోటీల్లో పాల్గొన్నారు. మొదటి స్థానంలో నిలిచిన నక్కపల్లి మండలం దొండవాకకు చెందిన చెల్లూరి నూకరాజుకు రూ.పది వేలు, రెండో స్థానంలో నిలిచిన రాంబిల్లి మండలం నర్సాపురానికి చెందిన సూరాడ అప్పలరాజుకు రూ.ఐదు వేలు, మూడో స్థానంలో నిలిచిన బంగారమ్మపాలెంకు చెందిన వాసుపల్లి బాబ్జికి రూ.రెండు వేల నగదు బహుమతి అందజేశారు.

-ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని