logo

ఎన్టీపీసీ సీహెచ్‌పీ ప్లాంట్‌ ప్రారంభము

పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ సీహెచ్‌పీ ప్లాంట్‌ సమీపంలో సుమారు ఎకరం స్థలంలో తీర్చిదిద్దిన ఉద్యానవనాన్ని శుక్రవారం సంస్థ సీజీఎం దివాకర్‌ కౌశిక్‌ ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. అందరికీ ఆహ్లాదం అందేలా సంస్థ సీహెచ్‌పీ విభాగం ఉద్యోగులు ముందుకొచ్చి పార్కుని సిద్ధం చేయడం అభినందనీయమన్నారు.

Published : 15 Jan 2022 05:29 IST

ప్రారంభోత్సవంలో సంస్థ సీజీఎం దివాకర్‌ కౌశిక్‌ తదితరులు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ సీహెచ్‌పీ ప్లాంట్‌ సమీపంలో సుమారు ఎకరం స్థలంలో తీర్చిదిద్దిన ఉద్యానవనాన్ని శుక్రవారం సంస్థ సీజీఎం దివాకర్‌ కౌశిక్‌ ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. అందరికీ ఆహ్లాదం అందేలా సంస్థ సీహెచ్‌పీ విభాగం ఉద్యోగులు ముందుకొచ్చి పార్కుని సిద్ధం చేయడం అభినందనీయమన్నారు. పార్కు మధ్యలో 15 అడుగుల ఎత్తులో మానవ ఆకారంలో ఏర్పాటు చేసిన ఇనుప ఊచల విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. వివిధ ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటారు. సంస్థ జీఎం చౌక్సే, హెచ్‌ఆర్‌ ఏజీఎం రుమాడి శర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని