logo

నేడు విభాగాధిపతుల కార్యాలయాల వద్ద ధర్నా

క్కు పరిరక్షణ, కార్మికుల జీతభత్యాల కోసం ఉమ్మడి పోరాటంలో భాగంగా విభాగాధిపతుల కార్యాలయాల వద్ద మంగళవారం నిర్వహిస్తున్న ధర్నాలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోరాట కమిటీ కో-కన్వీనర్‌

Published : 18 Jan 2022 05:47 IST

దీక్షల్లో కూర్చున్న ఉక్కు కార్మికులు

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: ఉక్కు పరిరక్షణ, కార్మికుల జీతభత్యాల కోసం ఉమ్మడి పోరాటంలో భాగంగా విభాగాధిపతుల కార్యాలయాల వద్ద మంగళవారం నిర్వహిస్తున్న ధర్నాలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోరాట కమిటీ కో-కన్వీనర్‌ గంధం వెంకటరావు పిలుపునిచ్చారు. కూర్మన్నపాలెం కూడలిలోని దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గతంలో బీసీ గేటు, ప్రధాన పరిపాలనా భవనం వద్ద ధర్నాలు నిర్వహించామని పేర్కొన్నారు. ప్రజా సంపదను స్వదేశీ, విదేశీ కార్పొరేటు శక్తులకు కట్టబెట్టేందుకు చేస్తున్న యత్నాలను తీవ్రంగా ఖండించారు. దీక్షలు సోమవారం 340వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో ఈఎస్‌ఎఫ్‌, ఈఆర్‌ఎస్‌, సేఫ్టీ విభాగాల కార్మికులు కూర్చున్నారు. విభాగాల ప్రతినిధులు గంగాధర్‌, పాండే, ఎంఎన్‌రెడ్డి, జి.శ్రీనివాస్‌, ఓవీ రావు, బి.రాము, కె.ఆనందరావు, నీలకంఠం, జి.సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని