logo

నిలిచిన రూ.15 వేల పెంపు ప్రతిపాదన

జీవీఎంసీ ఉద్యాన విభాగంలో పనిచేస్తున్న నలుగురు పొరుగు సేవల ఉద్యోగులకు ఒకేసారి రూ.15 వేల వేతనం పెంచే అంశాన్ని అజెండాలో ప్రతిపాదించడంపై కమిషనర్‌ రాజాబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Updated : 31 Jan 2023 05:18 IST

 

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: జీవీఎంసీ ఉద్యాన విభాగంలో పనిచేస్తున్న నలుగురు పొరుగు సేవల ఉద్యోగులకు ఒకేసారి రూ.15 వేల వేతనం పెంచే అంశాన్ని అజెండాలో ప్రతిపాదించడంపై కమిషనర్‌ రాజాబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తక్షణమే ఆ ప్రతిపాదన పక్కన పెట్టాలని ఉద్యాన విభాగాధికారి దామోదరరావును ఆదేశించారు. ఈ నెల 27న ‘ఈనాడు’లో ‘ఒకేసారి 15వేలా’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. సోమవారం ఉద్యాన విభాగాధికారిని పిలిచి ఆరా తీశారు. తనకు తెలియకుండా ఈ అంశం ఎలా చేరిందని ప్రశ్నించారు. గత కమిషనర్‌ లక్ష్మీశ వేతనాల పెంపునకు ఆమోదించారని చెప్పగా, ఇన్నాళ్లు కౌన్సిల్‌ సమావేశంలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మేయరు, అధికార పార్టీ నాయకులు ఒప్పుకోలేదని ఆయన చెప్పడం గమనార్హం. మరి ఇప్పుడెలా అంగీకరించారని కమిషనర్‌ ప్రశ్నించగా అధికారి సమాధానం ఇవ్వలేదు. నలుగురు సిబ్బందికి ఒకేసారి రూ.15వేలు పెంచితే, మిగతావారు ఊరుకుంటారా అని కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రతిపాదన పక్కన పెట్టాలని ఆదేశించారు. బ్యాటరీ కారు కొనుగోలు చేయాలని అజెండాలో ప్రతిపాదించడంపైనా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా నిర్ణయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని