logo

ఒకరి ఓటు... మరొకరు వేసేశారు

జ్యోతినగర్‌ ప్రాథమిక పాఠశాలలో ఒకరి ఓటు ఇంకొకరు వేయడంతో కలకలం రేగింది. 53వ వార్డు ప్రాంతానికి చెందిన పట్టభద్రురాలైన ఎం.డి.అమీనా బీబీకి పీఎస్‌ నెం.270లో సీరియల్‌ నెంబర్‌ 674లో ఓటు ఉంది.

Published : 14 Mar 2023 03:53 IST

మాధవధార, న్యూస్‌టుడే: జ్యోతినగర్‌ ప్రాథమిక పాఠశాలలో ఒకరి ఓటు ఇంకొకరు వేయడంతో కలకలం రేగింది. 53వ వార్డు ప్రాంతానికి చెందిన పట్టభద్రురాలైన ఎం.డి.అమీనా బీబీకి పీఎస్‌ నెం.270లో సీరియల్‌ నెంబర్‌ 674లో ఓటు ఉంది. దాదాపుగా రెండు గంటల పాటు క్యూలైన్‌లో నిలబడి, బూత్‌ వద్దకు వెళ్తే, ఆమె ఓటును గంట ముందు మరొకరు వేసినట్లుగా ఉంది. దీంతో ఆమె పోలింగ్‌ అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓటు వేసిన మరో మహిళ ఐ.డి నెంబర్‌, ఆధార్‌ నెంబర్‌ వేరుగా ఉన్నాయి. కానీ ఆమెకు ఓటు ఎలా ఇచ్చారనేది అధికారులు చెప్పకపోవడం గమనార్హం. ఓటు వేసే ప్రతి ఒక్కరి ఐ.డి పక్కాగా పరిశీలిస్తున్న అధికారులు, తన ఓటు విషయంలో ఎలా తప్పిదం చేసారంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే తన ఓటును మరొకరి చేత వేయించారని ఆరోపించారు. ఛాలెంజ్‌ ఓటు ఇవ్వాలని అడిగినప్పటికీ, ఈ ఎన్నికల విధానంలో అటువంటిది లేదన్నారు. దీంతో ఆమె ఎన్నికల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాననడంతో తప్పిదం చేసిన అధికారులు, ఏజెంట్లు కలిసి ఆమెకు క్షమాపణ చెప్పారు. ఓటు కోల్పోయిన మహిళ తీవ్ర నిరాశతో వెనుదిరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని