logo

టమాటా పోయింది.. అరటికి ముప్పుంది!

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శని, ఆదివారాల్లో కురిసిన భారీ వర్షాలకు గొలుగొండ మండలంలో సుమారు 300 ఎకరాల్లో టమాటా తోటలు దెబ్బతిన్నాయి.

Published : 20 Mar 2023 03:22 IST

తాళ్లచీడికాడ వద్ద అరటి తోటలో నిలిచిన వర్షపు నీరు

గొలుగొండ, న్యూస్‌టుడే: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శని, ఆదివారాల్లో కురిసిన భారీ వర్షాలకు గొలుగొండ మండలంలో సుమారు 300 ఎకరాల్లో టమాటా తోటలు దెబ్బతిన్నాయి. ఇవి తిరిగి కోలుకునే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు. తాళ్లచీడికాడ, ఏటిగైరంపేట, లింగంపేట, పాకలపాడు, రావణాపల్లి, కొమిరి, ముంగర్లపాలెం తదితర ప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో సాగవుతున్న అరటి తోటల్లో నీరు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల్లో 89.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం ఈ నెల 21 వరకు వర్షాలు పడితే ఇప్పటికే కోతకు సిద్ధంగా ఉన్న అరటి గెలలు నేలవాలుతాయేమోనని వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని