logo

కనకమహాలక్ష్మి ఆలయ అభివృద్ధికి ప్రణాళిక

కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఈవోగా రమేష్‌ నాయుడు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు ఇన్‌ఛార్జి ఈఓగా కొనసాగిన జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ కె.శిరీష నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.

Published : 30 Mar 2023 04:33 IST

ఈవోగా బాధ్యతలు స్వీకరించిన రమేష్‌నాయుడు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఈవోగా రమేష్‌ నాయుడు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు ఇన్‌ఛార్జి ఈఓగా కొనసాగిన జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ కె.శిరీష నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ఆలయ విశిష్టత మరింత ఇనుమడించేలా కార్యక్రమాలను చేపడతామన్నారు. ఆలయం ఇరుకు ప్రదేశంలో ఉందని, విస్తరణకు వీలుగా స్థలాలను సేకరిస్తామన్నారు. భక్తులకు మరింత చేరువగా అమ్మవారిని తీసుకెళతామని, పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకొని ఒక ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. ఏఈఓ వి.రాంబాబు, ఈఈ సీహెచ్‌.వి.రమణ, ఇతర అధికారులు, ఆలయ ట్రస్టీలు రమేష్‌నాయుడును కలిసి అభినందనలు తెలిపారు. బీ రమేష్‌నాయుడు 2007లో డిప్యూటీ తహసీల్దారుగా ఎంపికయ్యారు. సర్వీసు అంతా గుంటూరు జిల్లాలో కొనసాగింది. రెండు నెలల కిందట డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన ఆయన ఇటీవల జరిగిన బదిలీల్లో కనకమహాలక్ష్మి ఆలయ ఈవోగా నియమితులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని