logo

అనుమతి లేని నిర్మాణంపై ప్రశ్నిస్తే దాడి

జీవీఎంసీ 12వ వార్డు పరిధిలోని తోటగరువులో అనధికారిక భవన నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన వీఆర్‌ఓ యువరాజ్‌పై సదరు భవన యజమాని దాడిచేశారు.

Published : 03 Jun 2023 03:27 IST

పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వీఆర్వో

సిబ్బందితో వాగ్వాదానికి దిగిన నిర్మాణదారుడు

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే: జీవీఎంసీ 12వ వార్డు పరిధిలోని తోటగరువులో అనధికారిక భవన నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన వీఆర్‌ఓ యువరాజ్‌పై సదరు భవన యజమాని దాడిచేశారు. దీంతో సిబ్బంది ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తోటగరువు పరిధిలోని బీటీఆర్‌ నగర్‌ రెవెన్యూ స్థలంలో అనధికారికంగా నిర్మాణం జరుగుతున్నట్లు గుర్తించిన రెవెన్యూ సిబ్బంది, సచివాలయ కార్యదర్శితో కలిసి నిలుపుదల చేయాలని శుక్రవారం నోటీసులు అందించడానికి వెళ్లారు. ఇది తమ స్థలం, పూర్వీకుల నుంచి తమ స్వాధీనంలో ఉందని నిర్మాణదారు హేమంత్‌ వాగ్వాదం చేశారు. ఆపై సహనం కోల్పోయి వీఆర్‌ఓపై దాడికి దిగారు. దీంతో ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగపు అధికారుల ఆదేశాలతో సిబ్బంది వచ్చి తోటగరువు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పక్కన, బీటీఆర్‌ నగర్‌లో నిర్మాణంలో ఉన్న నిర్మాణాలను తొలగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని