logo

తోట త్రిమూర్తులుపై పోరాటం ఆగదు

వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుపై కోర్టు విధించిన శిక్ష నేర తీవ్రతకు సరిపడా లేదని, ప్రజాక్షేత్రంతో పాటు న్యాయస్థానాల్లోనూ తగిన శిక్ష పడే దాకా తమ పోరాటం కొనసాగుతుందని విశాఖ దళిత సంఘం (విదసం) ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్‌ బూసి వెంకటరావు తెలిపారు.

Published : 18 Apr 2024 04:52 IST

సీతంపేట, న్యూస్‌టుడే: వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుపై కోర్టు విధించిన శిక్ష నేర తీవ్రతకు సరిపడా లేదని, ప్రజాక్షేత్రంతో పాటు న్యాయస్థానాల్లోనూ తగిన శిక్ష పడే దాకా తమ పోరాటం కొనసాగుతుందని విశాఖ దళిత సంఘం (విదసం) ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్‌ బూసి వెంకటరావు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు తోట త్రిమూర్తులుపై ఇచ్చిన తీర్పు నేపథ్యంలో దళిత సంఘాల పోరాట కార్యాచరణపై బుధవారం విశాఖ అంబేడ్కర్‌ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.  కోర్టు త్రిమూర్తులను దోషిగా ప్రకటించినందున ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆయనకు ఎమ్మెల్యే టికెట్‌ రద్దుచేసి, ఎమ్మెల్సీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. దళితులపై జరిగిన దాడుల పట్ల జగన్‌ మోహన్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. త్రిమూర్తులు టికెట్‌ రద్దుచేయకుంటే ఆయనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తామని హెచ్చరించారు. త్రిమూర్తులు శిక్షాకాలం పెంచాలని, శిక్షలు ఏక కాలంలో కాకుండా విడివిడిగా మూడేళ్లు అమలు చేయాలని ఉన్నత న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సోడదాసి సుధాకర్‌, కోలా హరిబాబు, బంటు కృష్ణారావు, బల్ల కుమార్‌, జాజి ఓంకార్‌, బోడపాటి శామ్యూల్‌ కుమార్‌, కోరమాటి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని