logo

Vizianagaram: రక్షిత తాగునీటిలో పురుగులు

పట్టణంలోని గాంధీవీధిలో రాజాం రక్షిత తాగునీటి పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీటిలో పురుగులు వస్తున్నాయి. శుక్రవారం దీన్ని గుర్తించిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 11 Nov 2023 09:07 IST

రాజాం, న్యూస్‌టుడే: పట్టణంలోని గాంధీవీధిలో రాజాం రక్షిత తాగునీటి పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీటిలో పురుగులు వస్తున్నాయి. శుక్రవారం దీన్ని గుర్తించిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పురపాలక ఏఈ వెంకటరమణరాజు నమూనాలను సేకరించారు. ఓ ప్రజా కుళాయి వద్ద ఈ పరిస్థితి ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. లార్వా వృద్ధి చెందడంతో పైపు ద్వారా పురుగులు వచ్చి ఉంటాయని అంచనా వేశారు. సరఫరా విభాగం అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే తరచూ కలుషిత నీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని