logo

పిడుగుపాటుతో మహిళ మృతి

వంగర మండలం బంగారువలస గ్రామానికి చెందిన బౌరౌతు సత్తెమ్మ (57) గురువారం సాయంత్రం వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో..

Published : 10 May 2024 03:04 IST

వంగర, న్యూస్‌టుడే: వంగర మండలం బంగారువలస గ్రామానికి చెందిన బౌరౌతు సత్తెమ్మ (57) గురువారం సాయంత్రం వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఉరుములతో కూడిన వర్షం, పిడుగులు పడడంతో గ్రామ సమీపంలో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. ఆమెకు భర్త గంగరాజు, కుమార్తె, కుమారుడు ఉన్నారు. వ్యవసాయ పనులకు వెళ్లి ఇంటికి రాకపోవడంతో వెతకగా.. గ్రామ సమీపంలోనే మృతిచెంది ఉండడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని