logo

మంకీ ఫుడ్‌కోర్టులో అగ్ని ప్రమాదం

ములుగు మండలం జాకారంలోని మంకీ ఫుడ్‌కోర్టులో ఆదివారంరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పెంచుతున్న పండ్ల మొక్కలు కాలిపోయాయి

Published : 24 May 2022 04:22 IST

కాలిపోయిన మొక్కలను పరిశీలిస్తున్న డీపీవో వెంకయ్య

ములుగు, న్యూస్‌టుడే: ములుగు మండలం జాకారంలోని మంకీ ఫుడ్‌కోర్టులో ఆదివారంరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పెంచుతున్న పండ్ల మొక్కలు కాలిపోయాయి. ఫుడ్‌కోర్టు సమీపంలోని పంట పొలాలకు చెందిన గడ్డిని రైతులు తగులబెట్టడంతో మంటలు చెలరేగి మంకీ ఫుడ్‌కోర్టులోకి వ్యాపించాయి. దీంతో మొక్కలు కాలిపోయాయి.  ఇతర ప్రాంతం నుంచి అగ్నిమాపక వాహనం వచ్చేలోగా నష్టం జరిగిపోయింది. గ్రామ పంచాయతీకి చెందిన నీటి ట్యాంకుతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. సోమవారం జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య మంకీ ఫుడ్‌కోర్టు ప్రదేశాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ వివరాలను జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠికి వివరించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని