logo

వార్డుకో ఆట స్థలం

తెలంగాణ క్రీడా ప్రాంగణం పథకంలో మున్సిపాల్టీలు, నగరపాలికల పరిధిలో వార్డుకో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కో దాన్ని ఎకరం స్థలంలో ఏర్పాటు

Updated : 28 May 2022 04:05 IST

జనగామలో క్రీడాస్థలం పరిశీలిస్తున్న కలెక్టర్‌ శివలింగయ్య, తదితరులు

జనగామ, న్యూస్‌టుడే: తెలంగాణ క్రీడా ప్రాంగణం పథకంలో మున్సిపాల్టీలు, నగరపాలికల పరిధిలో వార్డుకో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కో దాన్ని ఎకరం స్థలంలో ఏర్పాటు చేయాలని సూచించారు. క్రీడలపై యువతకు ఆసక్తి పెంచాలని, తద్వారా వివిధ క్రీడల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండేలా చూడాలన్నది ఈ పథకం లక్ష్యం.

పట్టణాల పరిధిలో స్థలాల కొరత : వీటి ఏర్పాటుకు పట్టణ ప్రగతి నిధులను వినియోగించుకోవచ్ఛు క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. ప్రస్తుత సంవత్సరం ఏ పురపాలిక పరిధిలో ఎన్ని ప్రాంగణాలు తీర్చిదిద్దాలో సూచించారు. పట్టణాల్లో పూర్వ పాఠశాలల్లో తప్పా, ఇతర చోట ఆట మైదానాలు లేవు. వార్డుకో క్రీడా ప్రాంగణాన్ని ఎకరం స్థలంలో ఏర్పాటు చేసేందుకు స్థలం అందుబాటులో లేవని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలోచనలో పడ్డారు. పురపాలికల్లో వార్డుకు ఒకటి ఏర్పాటు చేసినా.. వరంగల్‌ మహా నగర పాలక సంస్థలో మాత్రం ప్రతి డివిజన్‌కు మూడు చొప్పున మొత్తం 198 ఏర్పాటు చేయాలని లక్ష్యం నిర్దేశించారు.

ఇవి ఉండాలి : వాలీబాల్‌ కోర్టు, ఖోఖో, కబడ్డీ, రెండు వ్యాయామ సమాంతర కడ్డీలు(ఎక్సర్‌సైజ్‌ పార్లల్‌బార్స్‌), సింగిల్‌ బార్‌ ఒకటి, లాంగ్‌జంప్‌ పిట్‌ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని సూచించారు. ప్రవేశద్వారం, ఆటస్థలం ప్రణాళిక ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని