logo

దర్శన యాతన తీరేదెన్నడో..?

రామప్పను చూసేందుకు నిత్యం వందలాది మంది తరలివస్తున్నారు. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయడం లేదు. వృద్ధులు, వికలాంగులను తీసుకువెళ్లడం కోసం కనీసం వీల్‌ఛైర్లు కూడా ఏర్పాటు చేయలేదు.

Published : 15 Aug 2022 02:26 IST

వెంకటాపూర్‌ (ములుగు జిల్లా), న్యూస్‌టుడే: రామప్పను చూసేందుకు నిత్యం వందలాది మంది తరలివస్తున్నారు. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయడం లేదు. వృద్ధులు, వికలాంగులను తీసుకువెళ్లడం కోసం కనీసం వీల్‌ఛైర్లు కూడా ఏర్పాటు చేయలేదు. దాంతో కుటుంబ సభ్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆలయ ప్రాంగణం బురదమయంగా మారింది. అక్కడక్కడ వరద నిలవడంతో అవస్థలు పడుతున్నారు. సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరుతున్నారు.

రామప్పలో సండే సందడి
రామప్పలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సెలవుల నేపథ్యంలో భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తరలివచ్చారు. రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం బారులు తీరారు. టూరిజం గైడ్ల ద్వారా లయ చరిత్ర, శిల్పకళా వైభవాన్ని గురించి తెలుసుకున్నారు. అమెరికా, జింబాబ్వే దేశాలకు చెందిన ఎలిజబెత్‌, ఫ్లోరెన్స్‌, జోర్డాన్‌, జేమ్స్‌ సందర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని