logo

సీబీఐ అధికారుల అదుపులో పోస్టుమాస్టర్‌

వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధి కొడకండ్ల ఠాణా పరిధి కొడకండ్ల పోస్టాఫీస్‌లో రెండు నెలల కిందట రూ.1.70కోట్ల కుంభకోణం జరిగింది. దీనిపై ఇప్పటికే సీబీఐ అధికారులు కేసు నమోదు చేయగా నిందితుడిగా ఉన్న కొడకండ్ల పోస్టుమాస్టర్‌ సతీష్‌

Published : 18 Aug 2022 05:24 IST

నగరంలో గాలింపు చేపట్టి చివరికి అరెస్టు

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధి కొడకండ్ల ఠాణా పరిధి కొడకండ్ల పోస్టాఫీస్‌లో రెండు నెలల కిందట రూ.1.70కోట్ల కుంభకోణం జరిగింది. దీనిపై ఇప్పటికే సీబీఐ అధికారులు కేసు నమోదు చేయగా నిందితుడిగా ఉన్న కొడకండ్ల పోస్టుమాస్టర్‌ సతీష్‌ అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. నిందితుడు వరంగల్‌లో ఉన్నట్లు సీబీఐ అధికారులకు సమాచారం రాగా హైదరాబాద్‌ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం బుధవారం ఉదయం నుంచి నగరంలోని పలు ప్రదేశాల్లో హనుమకొండ సబ్‌ డివిజన్‌ పోలీసుల సాయంతో గాలింపు చేపట్టారు. నిందితుడు ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో సీబీఐ అధికారులు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలుత హనుమకొండలో ఉన్నట్లు గుర్తించి పట్టుకునేందుకు వెళ్లగా అధికారులను చూసి నిందితుడు తృటిలో తప్పించున్నట్లుగా తెలిసింది. అతడి బంధువులు వరంగల్‌, కాజీపేటల్లో ఉండగా సీబీఐ అధికారులు ఆయా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. చివరకు నిందితుడు హనుమకొండలోని ఓ ప్రాంతంలో ఉండగా వలపన్ని పట్టుకున్నారు. అనంతరం సుబేదారి ఠాణాకు తరలించి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లినట్లు తెలిసింది. దీనిపై పోలీస్‌ అధికారులను వివరణ కోరగా.. తమకేమీ సంబంధం లేదని, సీబీఐ అధికారులు సాయం కోరితే సిబ్బందిని పంపించినట్లు వివరించారు. అరెస్టు విషయం మాకు తెలియదని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని