logo

సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం

సమాచార హక్కు చట్టం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ డాక్టర్‌ గుగులోతు శంకర్‌నాయక్‌ అన్నారు. శుక్రవారం ములుగు కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన అప్పీల్‌ హియరింగ్‌లో

Published : 01 Oct 2022 06:16 IST

కేసులు విచారిస్తున్న రాష్ట్ర సహ చట్టం కమిషనర్‌ డాక్టర్‌ గుగులోతు శంకర్‌నాయక్‌

ములుగు, న్యూస్‌టుడే: సమాచార హక్కు చట్టం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ డాక్టర్‌ గుగులోతు శంకర్‌నాయక్‌ అన్నారు. శుక్రవారం ములుగు కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన అప్పీల్‌ హియరింగ్‌లో చట్టం ద్వారా సమాచారం అడిగిన దరఖాస్తుదారులు, పౌరసమాచార అధికారులతో 30 కేసులకు సంబంధించి విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో బవాబుదారితనంతో ప్రజలు కోరిన సమాచారాన్ని నిర్దేశించిన సమయంలో ఇవ్వాలన్నారు. 30 రోజుల్లో సమాచారం ఇవ్వనట్లయితే మొదటి అప్పీల్‌ చేసుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు. జిల్లాకు సంబంధించి 39 కేసుల విచారణ నిర్వహించి దరఖాస్తుదారులకు కోరిన సమాచారం సత్వరమే అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పౌర సమాచార అధికారులు 17 అంశాలతో కూడిన సమాచారం కార్యాలయంలో ప్రదర్శించాలన్నారు. మొదటి అప్పిలేట్‌ అథారిటీల పేర్లు, హోదా, ఫోన్‌ నెంబర్ల వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా..
పౌరులకు సమాచారం అందించడం, సత్వర పరిష్కారానికి రాష్ట్ర కమిషన్‌ చర్యలు తీసుకుంటూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మూడు నుంచి ఆరు నెలలలోపు కేసు విచారణ చేపట్టి సమాచారం అందిస్తూ విజయవంతంగా ముందుకు వెళ్తోందన్నారు. కరోనా ఉద్ధృతి సమయంలో టెలిఫోనిక్‌ హియరింగ్‌ చేపట్టి అనేక మంది దరఖాస్తుదారులకు సమాచారం ఇప్పించామన్నారు. జిల్లాలో 140 అప్పీళ్లకు గాను 89 అప్పీళ్లు పరిష్కరించామని మిగిలినవి త్వరలో పరిష్కరిస్తామన్నారు. అదనపు కలెక్టర్‌ వైవి గణేష్‌, డీఆర్‌వో రమాదేవి, కలెక్టర్‌ కార్యాలయ పరిపాలనాధికారి విజయ భాస్కర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని