విదేశీ చదువుకు విద్యానిధి తోడుగా..!
డిగ్రీ పూర్తి చేసి విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలని ఆసక్తి ఉండి ఆర్థికంగా వెనకబడిన నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు విదేశీ విద్యానిధి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది.
యశ్వంతాపూర్‌లోని క్రీస్తుజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలోని విద్యార్థులు
జనగామ అర్బన్, న్యూస్‌టుడే: డిగ్రీ పూర్తి చేసి విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలని ఆసక్తి ఉండి ఆర్థికంగా వెనకబడిన నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు విదేశీ విద్యానిధి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. విద్యార్థుల చదువుకు అవసరమయ్యే రూ.20లక్షల రుణాన్ని రెండు విడతల్లో రూ.10లక్షల చొప్పున అందించి వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటునిస్తుంది. నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి, మైనారిటీలకు ముఖ్యమంత్రి ఓవర్సీస్, బీసీలకు ఎంజేపీ విద్యానిధి పథకాలతో ఆయా వర్గాలకు చెందిన విద్యార్థుల చదువుకు భరోసానిస్తుంది. 2014-15 విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ, ఎస్టీలకు, 2018 నుంచి బీసీలకు ఈ పథకాలను అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా నుంచి విదేశాల్లో అభ్యసించింది అంతంత మాత్రమే. చాలా మందికి అవగాహన లేకపోవడంతో మంచి అవకాశాలను కోల్పోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద విద్యార్థుల ప్రయోజనార్ధం విదేశీ విద్యపై ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న కథనం..!
చేయూతనిస్తున్నా.. అంతంతే
విదేశీ విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తునప్పటికీ.. సద్వినియోగం చేసుకుంటున్నది కొందరు మాత్రమే. అంబేడ్కర్ ఓవర్సీస్ పథకం ప్రారంభమై ఎనిమిదేళ్లయినా ఇప్పటివరకు విదేశాలకు వెళ్లింది 8 మంది మాత్రమే. ముఖ్యమంత్రి ఓవర్సీస్ పథకం ద్వారా 2019-20 విద్యా సంవత్సరంలో ముగ్గురు, 2020-21లో ఒక్కరు ఎంపికయ్యారు. మహత్మా జ్యోతిబా ఫులే విద్యానిధి పూర్తి వివరాలు రాష్ట్రస్థాయిలోనే ఉన్నందున ఈ పథకం ద్వారా జిల్లా నుంచి 12 మంది ఎంపికైనట్లు సమాచారం. ఇందులో కొందరు ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి అక్కడే ఉద్యోగులుగా స్థిరపడ్డారు. ప్రభుత్వం చేయూతనిస్తున్నా అవగాహన లేక కొందరు, అవగాహన ఉన్నా వినియోగించుకోలేనివారు మరికొందరు.
అవగాహన కల్పించాలి: జిల్లా వ్యాప్తంగా ఏటా వందలాది మంది పట్టభద్రులవుతున్నారు. ఇందులో చాలా మందికి విదేశాల్లో చదువుకోవాలనే తపన ఉన్నా ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా వెళ్లలేకపోతున్నారు. విద్యానిధితో విదేశీ విద్యను ప్రోత్సహిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఇది అందరికీ దక్కడం లేదు. జిల్లాలో 17కు పైగా ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, ఒక ప్రభుత్వ, ఒక ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలున్నాయి. అధికారులు, కళాశాలల యాజమాన్యం అవగాహన కల్పిస్తే చాలా మంది విదేశాల్లో చదువుకునేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉంది.
దరఖాస్తు ఇలా..
కులం, ఆదాయం, జనన ధ్రువీకరణ, ఆధార్, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ మార్కుల జాబితాలతో పాటు టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, జీఆర్‌ఈ, జీమ్యాట్ అర్హత కలిగి ఉండాలి. విదేశాల్లో విద్యాభ్యాసం చేయడానికి సంబంధిత కళాశాల ప్రవేశం అనుమతి పత్రం, కళాశాలకు చెల్లించిన ప్రవేశ రుసుం రశీదు, బ్యాంకు ఖాతా పుస్తకాలు. వీటి ఆధారంగా మీసేవా కేంద్రంలో, అంతర్జాలంలో తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.10 విలువైన నాన్ జ్యూడిషియల్ స్టాంపును అతికించి రిజిస్ట్రార్ సంతకంతో కూడిన ధ్రువీకరణను ఆదాయ ధ్రువీకరణ పత్రానికి జతచేసి దరఖాస్తును సమర్పించాలి. ఆయా సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలోని కమిటీ సభ్యులు పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు.
కావాల్సిన అర్హతలు
* ఇంజినీరింగ్, సైన్స్, మేనేజ్‌మెంట్, వ్యవసాయం, నర్సింగ్, సామాజిక శాస్త్ర కోర్సుల్లో డిగ్రీ కల్గి ఉండి 60శాతానికి పైగా మార్కులు సాధించాలి.
* టోఫెల్‌లో 60 శాతం. ఐఈఎల్‌టీఎస్‌లో 8.0 మార్కులు, జీఆర్‌ఈ, జీమ్యాట్‌లో 50 శాతం మార్కులు సాధించాలి.
* విద్యార్థుల వయస్సు 35 ఏళ్లు మించకూడదు.
* తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి.
సద్వినియోగం చేసుకోవాలి
రవీందర్, డీబీసీడీవో, జనగామ
విదేశాల్లో చదువుకోవాలని ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చేయూతనిస్తుంది. రూ.20 లక్షలు అందించి ఉన్నత విద్యాభ్యాసానికి కృషిచేస్తోంది. ఈ అవకాశం ఏడాదికి నాలుగు సార్లు ఉంటుంది. డిగ్రీ పూర్తి చేసిన నిరుపేద విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
vani jayaram: ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత
-
Politics News
TS Assembly: దేశం చూపు కేసీఆర్ వైపు.. సంక్షేమంలో మాకు తిరుగులేదు: కేటీఆర్
-
India News
కంటి చుక్కలతో అమెరికాలో మరణం.. భారత ఔషధ సంస్థలో అర్ధరాత్రి తనిఖీలు
-
Movies News
butta bomma review: రివ్యూ: బుట్టబొమ్మ
-
Politics News
Raghunandanrao: వారికి రూ.5 లక్షలు కాదు.. రూ.7.50 లక్షలు ఇవ్వండి: ఎమ్మెల్యే రఘునందన్‌రావు
-
India News
Bomb blast: సన్నీ లియోనీ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..