logo

రెండు పార్టీలకే పరిమితమైన ప్రజాస్వామ్యం

రాష్ట్రంలో, కేంద్రంలో ప్రజాస్వామ్యం కేవలం రెండు పార్టీలకే పరిమితమైందని మాజీ ఎంపీ, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.

Published : 06 Feb 2023 04:10 IST

మాట్లాడుతున్న టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి, చిత్రంలో ఎమ్మెల్యే సీతక్క, గాంధీ భవన్‌ మీడియా ఇన్‌ఛార్జి

ములుగు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో, కేంద్రంలో ప్రజాస్వామ్యం కేవలం రెండు పార్టీలకే పరిమితమైందని మాజీ ఎంపీ, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. రేవంత్‌రెడ్డి యాత్రను పురస్కరించుకొని ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా, భారాస ప్రభుత్వాలు రాచరిక పరిపాలన సాగిస్తున్నాయన్నారు. మేడారం సమ్మక్క- సారలమ్మల పోరాట గడ్డ నుంచి రేవంత్‌రెడ్డి యాత్ర ప్రారంభిస్తూ ప్రజలకు భరోసా కల్పించనున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను అణగదొక్కాలనే ఉద్దేశంతోనే ఫీజు రియంబర్స్‌మెంటు విడుదల చేయడం లేదని ఆరోపించారు. పంట రుణమాఫీ చేయని కారణంగా బ్యాంకులో రైతులు బకాయిదారులుగా మారుతున్నారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వలేదని విమర్శించారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. యాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గాంధీ భవన్‌ మీడియా ఇన్‌ఛార్జి, నాయకులు చామల కిరణ్‌కుమార్‌, పోరిక బలరాంనాయక్‌, సిరిసిల్ల రాజయ్య, విజయరమణారావు, గండ్ర సత్యనారాయణరావు, రవళిరెడ్డి, అశోక్‌, రాంరెడ్డి, రాజేందర్‌గౌడ్‌, రవిచందర్‌, ఎండి.చాంద్‌పాషా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని