logo

నర్సంపేట డిగ్రీ కళాశాలకు స్వయంప్రతిపత్తి హోదా

నర్సంపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల(కో ఎడ్యుకేషన్‌) స్వయం ప్రతిపత్తి హోదా పొందింది. నాలుగు దశాబ్దాలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మందిని ఉన్నత విద్యా వంతులుగా తీర్చిదిద్దిన ఘనత ఈ కళాశాల సొంతం.

Updated : 03 Jun 2023 05:38 IST

నర్సంపేట, న్యూస్‌టుడే: నర్సంపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల(కో ఎడ్యుకేషన్‌) స్వయం ప్రతిపత్తి హోదా పొందింది. నాలుగు దశాబ్దాలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మందిని ఉన్నత విద్యా వంతులుగా తీర్చిదిద్దిన ఘనత ఈ కళాశాల సొంతం. కళాశాల విద్యార్థులు పలువురు ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉన్నత హోదాల్లో స్థిరపడ్డారు. రాజకీయ రంగంలో కూడా మంచి స్థితికి ఎదిగిన వారున్నారు.

ఏడాదిలోనే..

నిరుడు మే మొదటి వారంలో పీర్‌ కమిటీ అధికారులు ఈ డిగ్రీ కళాశాలకు న్యాక్‌ ఏ గ్రేడ్‌ ఇవ్వగా ఏడాది వ్యవధిలో యూజీసీ అధికారులు స్వయం ప్రతిపత్తి హోదా ఇవ్వడం విశేషం. అటానమస్‌ కోసం ప్రిన్సిపల్‌, అధ్యాపకులు దరఖాస్తు చేసుకోగా యూజీసీ అధికారులు 2022 అక్టోబరు, గత ఏప్రిల్‌లో కళాశాలను సందర్శించి అన్ని పరిశీలించాక మే 31న స్వయం ప్రతిపత్తి హోదా ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రపంచ పోటీని ఎదుర్కొనే సామర్థ్యం పెంచుకునే అవకాశం కలుగుతోంది. సొంతంగా ఉద్యోగ, ఉపాధి ఓరియంటేషన్‌ కోర్సులు ప్రవేశ పెట్టే వీలుంటుంది. కంప్యూటర్‌ సైన్సు కోర్సులు కంప్యూటర్‌ ల్యాబ్‌, డిజిటల్‌ గ్రంథాలయం, మన టీవీ ల్యాబ్‌, వర్చువల్‌ వీడియో ప్రోగ్రామ్‌ ప్రత్యేక గది ఉంది. కళాశాలలో త్వరలోనే ఓపెన్‌ జిమ్‌, వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రిన్సిపల్‌ రమేశ్‌ తెలిపారు.  

ఆర్ట్స్‌ గ్రూపులతో మొదలై..

గ్రామీణ నేపథ్యం కలిగిన నర్సంపేట ప్రాంత విద్యార్థుల శ్రేయస్సు కోసం అప్పటి ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్‌ 1984లో డిగ్రీ కళాశాలను మంజూరు చేయించారు. సొంత భవనం లేనందున ద్వారకపేట రోడ్డులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో బీఏ, బీకాం గ్రూపులతో మొదలైన కళాశాల ప్రస్థానం అనంతర కాలంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంది.  1994లో రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఎమ్మెల్యే అయిన తరువాత 1999లో వల్లభ్‌ నగర్‌లో 18 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి పక్కా భవనం నిర్మించి బీఎస్సీ గ్రూపులను ప్రారంభించడంతో డిగ్రీ కళాశాలకు మహర్దశ పట్టింది.  2016లో పీర్‌ బృందం అధికారులు కళాశాలను సందర్శించి మౌలిఇక సదుపాయాలు, ఇతరత్రా అంశాలను పరిశీలించి న్యాక్‌  సీ గ్రేడ్‌ ఇచ్చారు. అప్పటి ప్రిన్సిపల్‌ చంద్రమౌళి స్థానిక ప్రముఖ వైద్యుడు విద్యాసాగర్‌రెడ్డి తోడ్పాటుతో రూ.4లక్షలు వెచ్చించి అభివృద్ధి చేశారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడంతో 2022 మేలో పీర్‌ కమిటీ అధికారుల బృందం డిగ్రీ కళాశాకు న్యాక్‌ ఏ గ్రేడ్‌ ఇచ్చారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు