రెట్టింపైన తలసరి ఆదాయం
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ చరిత్రలో ఓరుగల్లు కీలకపాత్ర పోషించిందని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్ వ్యాఖ్యానించారు.
పరేడ్ చేస్తున్న పోలీసులు
వరంగల్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ చరిత్రలో ఓరుగల్లు కీలకపాత్ర పోషించిందని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ నిర్మాణ స్థలంలో శుక్రవారం జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతకన్నా ముందు ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రం ఆవిర్భావం అనంతరం జిల్లాలో జరిగిన అభివృద్ధి వివరాలను సంక్షిప్తంగా వివరించారు. 2014-15 ఏడాదిలో జిల్లా తలసరి ఆదాయం రూ.82,084 ఉండగా.. ప్రస్తుతం రూ.1,71,111కు పెరిగిందన్నారు. జిల్లా మెడికల్ హబ్‌గా మారబోతోందన్నారు. జిల్లాలో 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మన ఊరు- మన బడి కార్యక్రమం ద్వారా మొదటి విడతలో జిల్లాలోని 645 ప్రభుత్వ పాఠశాలను ఎంపికచేసి రూ.105.17 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రంథాలయాల బలోపేతానికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి పుస్తకాలు సరఫరా చేస్తామన్నారు. పాకాల సరస్సు అభివృద్ధికి రూ.1.20 కోట్లు, కొమ్మాల శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవాలయ అభివృద్ధికి రూ.29లక్షలు, పురావస్తు ప్రదర్శనశాల నిర్మాణం కోసం రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు జరగుతున్నాయన్నారు. జిల్లాలోని 3,271 మంది గిరిజనులకు పోడుభూముల అటవీ హక్కుల పత్రాలను త్వరలో మంజూరు చేస్తామన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం తెలంగాణ అమరుల కుటుంబాలను సత్కరించారు. గీసుకొండ కేజీబీవీ, కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొత్తవాడ ప్రగతి పాఠశాల విద్యార్థినులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సీఎం కప్ 2023లో రాష్ట్రస్థాయిలో పతకాలు గెలిచిన క్రీడాకారులను అభినందించారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. పాలనాధికారి ప్రావీణ్య, ఎంపీ పసునూరి దయాకర్, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ గండ్రజ్యోతి, ఎమ్మెల్యేలు నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, మేయర్ గుండు సుధారాణి, అదనపు కలెక్టర్లు శ్రీవత్స, అశ్వినీ తానాజీ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
‘పూజారులపై దాడి చేస్తే ఏమైంది?’
-
‘విస్తరణ’ దారిలో విపరీత బుద్ధులు!
-
ఖరము పాలు ఖరీదు గురూ!
-
Canada: తొలిసారి.. కెనడా దిగువ సభ స్పీకర్‌గా ఆఫ్రో-కెనడియన్!
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Festival Sale: ఐఫోన్, పిక్సెల్, నథింగ్.. ప్రీమియం ఫోన్లపై పండగ ఆఫర్లివే!