logo

నేడు ములుగుకు కేటీఆర్‌ రాక

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు.

Published : 07 Jun 2023 04:29 IST

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం రామప్పకు చేరుకుని అక్కడ పూజా కార్యక్రమాలతో పాటు సరస్సు వద్ద రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి దినోత్సవం వేడుకలను ప్రారంభిస్తారు. ఆయా కార్యక్రమాల్లో కేటీఆర్‌తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, మహమూద్‌ అలీ హాజరుకానున్నారు.

కార్యక్రమాల వివరాలు..: * ఉదయం 10:15 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా ములుగు చేరుకుంటారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా పోలీస్‌ కార్యాలయం, మోడల్‌ బస్టాôడ్‌, సేవాలాల్‌ భవన్‌, డిజిటల్‌ లైబ్రరీ, ఐ అండ్‌ పీఆర్‌ మీటింగ్‌ హాల్‌, సీసీ రోడ్డు తదితర పనులకు శంకుస్థాపన చేస్తారు.

* 11:00: 5 మోడల్‌ పోలీస్‌ స్టేషన్లకు శంకుస్థాపన చేస్తారు.

* 11:30: రామప్ప ఆలయాన్ని చేరుకుని, పూజలు నిర్వహిస్తారు. ఆలయాన్ని తిలకిస్తారు.

* 11:45: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి దినోత్సవం వేడుకలను ప్రారంభిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకిస్తారు.

* మధ్యాహ్నం 12:15: ములుగులో బహిరంగ సభలో పాల్గొంటారు. ఐకేపీ మహిళలకు వడ్డీలేని రుణాల చెక్కులు, గొల్లకురుమలకు రెండో విడత గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తారు.

* 1:30: కార్యక్రమాలను ముగించుకుని పరకాల మండలం గుడెప్పాడ్‌కు బయల్దేరుతారు.

* 2:30: హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని