భువనగిరి బరిలో చామల
ఎడతెగని ఉత్కంఠ నడుమ అధికార కాంగ్రెస్ పార్టీ తమ భువనగిరి లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రకటించింది. ఆయన ఎంపీగా పోటీ చేయడం ఇదే తొలిసారి.
ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం
ఈనాడు, నల్గొండ: ఎడతెగని ఉత్కంఠ నడుమ అధికార కాంగ్రెస్ పార్టీ తమ భువనగిరి లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రకటించింది. ఆయన ఎంపీగా పోటీ చేయడం ఇదే తొలిసారి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మితో పాటూ పలువురు ఇక్కడి నుంచి టిక్కెట్ ఆశించారు. కానీ అధిష్ఠానం సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడైన చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వైపే మొగ్గు చూపింది. తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారానికి చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి యూత్ కాంగ్రెస్ విభాగంలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారు. 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 2007లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాహుల్‌గాంధీ కోటరిలో కీలకంగా వ్యవహరించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, అండమాన్, నికోబార్ దీవులకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2021 నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా, మీడియా ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.
తొలిసారి కోమటిరెడ్డి కుటుంబం కాకుండా..
2008లో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడగా..2009లో తొలిసారిగా అప్పటి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోటీ చేసి అప్పటి మహాకూటమి నుంచి పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి దివంగత నోముల నర్సింహయ్యపై గెలుపొందారు. 2014లో అప్పటి తెరాస (భారాస) అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై స్పల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. 2019లో రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన సోదరుడు వెంకట్‌రెడ్డి అప్పటి సిటింగ్ ఎంపీ బూర నర్సయ్యపై గెలుపొందారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి నాలుగోసారి ఎన్నికలు జరుగుతుండగా.. కోమటిరెడ్డి కుటుంబం కాకుండా వేరే వ్యక్తి పోటీ చేస్తుండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్‌సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వ తీర్థం పుచ్చుకొని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు యువ వారసులు సిద్ధమయ్యారు. -
గ్రేటర్ చుట్టూ రాజకీయం..!
[ 27-04-2024]
ఓవైపు వరంగల్ లోక్‌సభ ఎన్నికల ప్రచార హోరు.. మరోవైపు శుక్రవారం రాత్రి ఖిలావరంగల్ కోటలో కాంగ్రెస్, భారాస కార్పొరేటర్లు రహస్య సమావేశం. -
ఆమోదం 73 మంది.. తిరస్కరణ 15 మంది..
[ 27-04-2024]
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల పరిశీలన పూర్తయింది. వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాలకు జాతీయ, ప్రాంతీయ, గుర్తింపు పొందిన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 88 మంది 145 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు
[ 27-04-2024]
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని బల్దియా పాలకులు చెబుతున్నారు. ఏడాదికోసారి కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇచ్చే రేడియం స్టిక్కర్ ఉన్న ఆప్రాన్లు ఇవ్వడం లేదు. -
నకిలీ వైద్య కేంద్రాల్లో వైద్యమండలి తనిఖీలు
[ 27-04-2024]
హనుమకొండ జిల్లాలోని నకిలీ వైద్య కేంద్రాల్లో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి రాష్ట్ర వైద్యమండలి సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ ఛైర్మన్ డాక్టర్ వి.నరేష్కుమార్ తెలిపారు. -
భానుడు భగభగ.. ప్రయాణికులు విలవిల
[ 27-04-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. దాదాపు 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చిన పలువురు ఎండ ధాటికి విలవిలలాడారు. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
[ 27-04-2024]
లోక్‌సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్‌చంద్ సంబంధిత అధికారులకు సూచించారు. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే అభివృద్ధి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనసును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగలాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తి గాంచిన భద్రాచలం రాములోరి ఆలయం. -
చాడా.. తొలి పోటీలోనే తిరుగులేని విజయం
[ 27-04-2024]
హనుమకొండకు చెందిన చాడా సురేష్‌రెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. బీఏ డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1990 దశకంలో ప్రముఖ గుత్తేదారుగా గుర్తింపు కలిగి ఉన్నారు. -
ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలపై అధికారుల ఉదాసీనత
[ 27-04-2024]
జనగామ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు, గ్రామాల్లో క్లినిక్‌లు నిర్వహిస్తున్న వైద్యులు, ఆర్ఎంపీల ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేపట్టడానికి ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. -
కరవు కోరలు.. పశుగ్రాసానికి తంటాలు!
[ 27-04-2024]
వర్షాలు సరిగా లేక పంటలు వేసినా చాలా వరకు చేతికందలేదు.. దీంతో రైతన్నలు పశుగ్రాసానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మోరంచవాగుకు ఇరువైపులా పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది -
కక్షిదారులకు ఈ-న్యాయ సేవలు
[ 27-04-2024]
వివిధ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి కేసులకు సంబంధించిన సమాచారం, ధ్రువపత్రాలు, న్యాయసహాయం తదితర సేవలు మరింత సులభతరం కానున్నాయి. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్‌కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. -
పోలు చిట్టీలొచ్చాయ్..!
[ 27-04-2024]
లోక్‌సభ ఎన్నికల్లో శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు పోల్ చిట్టీలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
అనుమతి లేకుండా ల్యాబ్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు
[ 27-04-2024]
అనుమతి, అర్హతలు లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి కళావతిబాయి హెచ్చరించారు. -
వంతెనల నిర్మాణాల్లో తేలిపోతున్న నాణ్యత లోపాలు..
[ 27-04-2024]
దశాబ్దాల పాటు మన్నికగా ఉండాల్సిన వంతెనలు ఉన్నఫలంగా కూలిపోతున్నాయి. ప్రజల రవాణా కష్టాలను మెరుగు పర్చేందుకు నిర్మిస్తున్న వారధుల జీవితకాలం కొద్ది రోజుల్లోనే ముగుస్తోంది. -
రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
[ 27-04-2024]
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ .. ఆ పార్టీ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని’ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్