logo

దర్జాగా చెరువు మట్టి తరలింపు

ప్రభుత్వ అనుమతులు లేకుండా రాజకీయ పలుకుబడితో ఆక్రమార్కులు చెరువు మట్టిని దర్జాగా విక్రయిస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated : 17 Apr 2024 05:28 IST

జఫర్‌గఢ్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ అనుమతులు లేకుండా రాజకీయ పలుకుబడితో ఆక్రమార్కులు చెరువు మట్టిని దర్జాగా విక్రయిస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఇష్టానుసారంగా కట్టలు, చెరువుల్లో మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. సమస్యను రెవెన్యూ, ఐబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తమ పరిధి కాదని ఎవరికి వారు సమాధానం చెబుతున్నారు. జఫర్‌గఢ్‌ మండలం షాపల్లి, సూరారం, తమ్మడపల్లి(జి), సాగరం, తిమ్మంపేట, కోనాయచలం, రాజక్‌పూర్‌ చెరువుల్లోని మట్టిని తరలిస్తున్నారు. గ్రామస్థులు అడ్డుపడితే రాజకీయ పలుకుబడితో ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూడికతీత మట్టిని రైతులు తమ పొలాల్లో పోసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇదే అదనుగా కొందరు వ్యక్తులు ఏకంగా జేసీబీలతో చెరువుల్లో మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తు డబ్బులు దండుకుంటున్నారు. తవ్వకాలు ఆపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


చర్యలు తీసుకుంటాం...

 ఆంజనేయులు, తహసీల్దార్‌, జఫర్‌గఢ్‌

గ్రామాల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా చెరువులు, కుంటల్లో మట్టిని తరలిస్తున్నారని సమాచారం వస్తే తమ సిబ్బంది అక్కడి వెళ్లి అడ్డుకుంటున్నారు. చెరువులు, కుంటలు తమ పరిధిలో లేకున్న చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని