logo

మళ్లీ వస్తా.. మార్పు కన్పించాలి

నెలరోజుల్లో తిరిగి పాలకోడేరు వస్తానని డంపింగ్‌ యార్డుల నిర్వహణలో మార్పు కన్పించాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. పాలకోడేరులో డంపింగ్‌యార్డును ఆమె బుధవారం పరిశీలించారు. అనంతరం వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, అధికారులతో

Published : 26 May 2022 03:50 IST

పాలకోడేరులో డంపింగ్‌యార్డు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ప్రశాంతి

పాలకోడేరు, న్యూస్‌టుడే: నెలరోజుల్లో తిరిగి పాలకోడేరు వస్తానని డంపింగ్‌ యార్డుల నిర్వహణలో మార్పు కన్పించాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. పాలకోడేరులో డంపింగ్‌యార్డును ఆమె బుధవారం పరిశీలించారు. అనంతరం వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తడి, పొడి వ్యర్థాల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలన్నారు. ప్రతి వాలంటీరు తమ పరిధిలోని 50 కుటుంబాలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలో చెత్తసేకరణ, నిర్వహణ సరిగాలేదన్నారు. మురుగునీటి రీసైక్లింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుందో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ పవన్‌కి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఏవీ అప్పారావు, తహశీల్దార్‌ మధుసూదనరావు, గృహనిర్మాణ సంస్థ ఏఈ ఆంజనేయరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని