logo

ఇక ఉండలేం.. అందుకే వెళుతున్నాం!

కొయ్యలగూడెం మండలం పొంగుటూరులో సోమవారం జరిగిన వైకాపా ప్లీనరీ కోసం నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి పెద్దసంఖ్యలో మహిళలను వాహనాల్లో తరలించారు. దూరప్రాంతాల నుంచి ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు, ఇతర వాహనాల్లో తీసుకొచ్చిన వారి కోసం ప్లీనరీ వేదిక వద్ద భోజనాలను ఏర్పాటు చేశారు

Updated : 28 Jun 2022 07:04 IST

సమావేశం ప్రారంభమైన వెంటనే వెనుదిరిగిన మహిళలు

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: కొయ్యలగూడెం మండలం పొంగుటూరులో సోమవారం జరిగిన వైకాపా ప్లీనరీ కోసం నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి పెద్దసంఖ్యలో మహిళలను వాహనాల్లో తరలించారు. దూరప్రాంతాల నుంచి ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు, ఇతర వాహనాల్లో తీసుకొచ్చిన వారి కోసం ప్లీనరీ వేదిక వద్ద భోజనాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నానికే చేరుకున్న మహిళలు సమావేశం కోసం గంటల కొద్దీ పడిగాపులు పడ్డారు. తొలుత మధ్యాహ్నం రెండు గంటలకే సమావేశమని చెప్పిన నాయకులు మరో గంట పెంచారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం గంట ఆలస్యంగా మొదలయ్యేసరికి మహిళలు అసహనం వ్యక్తం చేశారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన కొందరికి భోజనాలు అందక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆలస్యమైందని, ఇక ఉండలేమంటూ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే పలువురు మహిళలు వెనుదిరగడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని