నేడు తాడేపల్లిగూడెంలో తెదేపా బహిరంగ సభ
తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి బహిరంగ సభను 50 వేల మందితో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు.
తాడేపల్లిగూడెం టూటౌన్, న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి బహిరంగ సభను 50 వేల మందితో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా శేషమహల్ కూడలిలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం ఆమె నియోజకవర్గ అధ్యక్షుడు వలవల బాబ్జీతో కలిసి పర్యవేక్షించారు. తాడేపల్లిగూడెం మండలం నందమూరు, ఆరుళ్ల, నవాబ్‌పాలెంలలో పర్యటించారు. శుక్రవారం సాయత్రం 4.30 గంటలకు తాడేపల్లిగూడెం మండలం నందమూరు అక్విడక్టు వద్ద చంద్రబాబునాయుడికి పశ్చిమగోదావరి జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతారన్నారు. అక్కడి నుంచి 5 వేల వాహనాలతో ర్యాలీగా పర్యటన ప్రారంభమవుతుందన్నారు. నవాబ్‌పాలెంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబునాయుడు స్వయంగా తెలుసుకుంటారన్నారు. ర్యాలీగా భీమవరం బైపాస్, గొర్రెల సూరన్న కాంప్లెక్సు, పోలీస్ ఐలాండ్, ఫ్లైఓవర్ మీదుగా ఎన్టీఆర్ చౌక్‌కు చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. సభలో కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీధర్, రవికుమార్, వెంకట్రావు, రాంప్రసాద్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27/01/2023)
-
World News
Handsome Man: శాస్త్రీయంగా ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే?
-
India News
Arvind Kejriwal: చర్చలకు పిలిచిన సక్సేనా.. నో చెప్పిన కేజ్రీవాల్
-
Technology News
Cola Phone: కోకాకోలా కొత్త స్మార్ట్‌ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
-
Movies News
Haripriya: ఒక్కటైన ‘కేజీయఫ్’ నటుడు, ‘పిల్ల జమీందార్’ నటి
-
World News
Pakistan: పాక్ సంక్షోభం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి