logo

శుభాలిచ్చు శోభకృత్‌

ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం రాత్రి ఉగాది మహోత్సవం వైభవంగా సాగింది. విద్యుద్దీపాలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన ఉగాది మండపానికి శేషవాహనంపై స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి తీసుకువచ్చి పూజలు చేశారు.

Published : 23 Mar 2023 04:09 IST

వైభవంగా ఉగాది ఉత్సవం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం రాత్రి ఉగాది మహోత్సవం వైభవంగా సాగింది. విద్యుద్దీపాలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన ఉగాది మండపానికి శేషవాహనంపై స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి తీసుకువచ్చి పూజలు చేశారు.


చల్లని తల్లీ.. దీవించమ్మా..

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే:   ఉగాది సందర్భంగా పలు ప్రాంతాల్లో అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. భీమవరం మావుళ్లమ్మ ఆలయంలో    సహస్ర నామ కుంకుమార్చనలు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పుష్పాలతో నేత్రపర్వంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో వేద పండితుడు సోమయాజులు పంచాంగ శ్రవణం చేశారు.


సంప్రదాయ సంబరం

పురస్కార గ్రహీతలతో అతిథులు, నిర్వాహకులు

భీమవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకొనే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్డీవో దాసి రాజు అన్నారు. కలెక్టరేట్‌, విజ్ఞాన వేదిక, వివిధ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది సంబరాలను భీమవరంలోని భీమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం వైభవంగా నిర్వహించారు. ఏఎస్పీ సుబ్బరాజు జ్యోతి వెలిగించి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో, పలువురు ప్రముఖులు మాట్లాడారు. వేదిక వద్ద జంగమదేవర, పిట్టలదొర, కొమ్మదాసుల ప్రదర్శనలు, చిన్నారుల ఆలపించిన కీర్తనలు ఆకట్టుకున్నాయి. తొలుత మావుళ్లమ్మ ఆలయం నుంచి వేడుకల వేదిక వరకు కలశాలతో శోభాయాత్ర నిర్వహించారు. ప్రముఖ డోలు విద్వాంసుడు వి.కృష్ణను సువర్ణ కంకణంతో సత్కరించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు 72 మందికి ఉగాది పురస్కారాలు అందించి సత్కరించారు. సంఘ సేవకుడు చెరుకువాడ రంగసాయి, తహసీల్దారు రవికుమార్‌, చీడే సత్యనారాయణ, తెదేపా రాష్ట్ర నాయకుడు మెంటే పార్థసారథి, వి.కనకరాజు, కె.వెంకట్రాజు, కనుమూరి సత్యనారాయణరాజు, లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు నందమూరి రాజేష్‌, కార్యదర్శి నరహరశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని