దళితులపై దాడుల్లో వైకాపాదే రికార్డు
దళితులపై దాడులు చేయడంలో ఎన్నడూ లేని రికార్డును వైకాపా ప్రభుత్వం సొంతం చేసుకుందని రాష్ట్ర తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు.
చించినాడలో పర్యటించిన తెదేపా నిజ నిర్ధారణ కమిటీ
పెరుగులంక భూముల్లోకి ర్యాలీగా వెళ్తున్న తెదేపా నేతలు
పాలకొల్లు, న్యూస్‌టుడే: దళితులపై దాడులు చేయడంలో ఎన్నడూ లేని రికార్డును వైకాపా ప్రభుత్వం సొంతం చేసుకుందని రాష్ట్ర తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. చించినాడ పెరుగులంక భూముల్లో తవ్వకాలపై జరుగుతున్న నిరసనల్లో గాయపడిన బాధితులను పరామర్శించడానికి నిజనిర్ధారణ కమిటీతో వచ్చిన ఆమె మాట్లాడుతూ దళిత పేరుచెప్పి హోంమంత్రి పదవి పొందిన తానేటి వనిత రాష్ట్రంలో దళితులపై వేలాది దాడులు జరుగుతుంటే పెదవి కదపడం లేదన్నారు. చొక్కాలు విప్పి రోడ్డుపై చిందులేసిన మంత్రి సురేష్ దళితులకు అన్యాయం జరుగుతుంటే అటువైపే చూడరన్నారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ సీఎం జగన్ దళితులను ఉక్కు సంకెళ్లతో అణచివేస్తున్నారన్నారు. వెనుకబడిన వర్గాలు, పేదలు అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పే ముఖ్యమంత్రి ఆయన అనుచరులు పెత్తందారులకే పట్టం కడుతున్నారని మాజీ మంత్రి పీతల సుజాత ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ మట్టి దొంగలకు పోలీసులు కాపలా కాస్తున్నారని వైఎస్ హయాంలో తప్పులుచేసి జైలుపాలైన అధికారుల మాదిరిగానే నేడు తప్పులు చేస్తున్న అధికారులంతా భవిష్యత్తులో కోర్టుల చుట్టూ తిరగక తప్పదని హెచ్చరించారు. లారీ మట్టి రూ.10 వేలకు వైకాపా నేతలు అమ్ముకుంటున్నారని ప్రభుత్వ పనులకు రెండు లారీలు పనిచేస్తుంటే అక్రమ అమ్మకాలకు 8 లారీలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్ మాట్లాడుతూ ఎన్ని అరాచకాలు చేసినా ఎవరూ ఏం చేయలేరనే భావనతో సీఎం ఉన్నారన్నారు. కమిటీ సభ్యుడు పిల్లి మాణిక్యాలరావు, సీపీఎం నాయకులు, నియోజకవర్గంలోని తెదేపా నాయకులు పాల్గొన్నారు.
స్వల్పఉద్రిక్తత.. పెరుగులంక భూముల పరిశీలనకు వచ్చిన తెదేపా కమిటీని పోలీసులు అడ్డుకోవడంతో చించినాడలో గురువారం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే రామానాయుడు, పార్టీనేత అనిత తదితరులు పోలీసులతో చర్చిస్తున్నపుడు తెదేపా శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులపైనా విమర్శలకు దిగడంతో గందరగోళం ఏర్పడింది.
డీఎస్పీ నేతృత్వంలో మోహరించిన పోలీసులు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
BJP: ఏపీలో మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతాం: పురంధేశ్వరి
-
Sai pallavi: ఇంతకన్నా నీచం మరొకటి ఉండదు.. పెళ్లి రూమర్స్‌పై సాయిపల్లవి ట్వీట్
-
Stock Market: నాలుగోరోజూ నష్టాల్లోనే.. 19,700 దిగువకు నిఫ్టీ
-
Sapta Sagaralu Dhaati Movie Review: రివ్యూ: సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ
-
Congress: జగన్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం: గిడుగు రుద్రరాజు
-
NCP : శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి.. స్పీకర్‌ను కోరిన అజిత్ మద్దతుదారులు