logo

ఆగని ఇసుక దందా

ఆచంట మండలం కరుగోరుమిల్లిలో సోమవారం కూడా ఇసుక తవ్వకాలు పెద్దఎత్తున జరిగాయి. ఆదివారం గ్రామస్థులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా ఇసుక రవాణా నిలిచింది.

Published : 30 Apr 2024 06:22 IST

కరుగోరుమిల్లిలో ఇసుక తవ్వకాలకు పొక్లెయిన్ల వినియోగం
ఆచంట, న్యూస్‌టుడే: ఆచంట మండలం కరుగోరుమిల్లిలో సోమవారం కూడా ఇసుక తవ్వకాలు పెద్దఎత్తున జరిగాయి. ఆదివారం గ్రామస్థులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా ఇసుక రవాణా నిలిచింది. తిరిగి సోమవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. పొక్లెయిన్‌లతో నదీ గర్భంలో నీరు ఉన్న గోతుల ప్రాంతాల్లో సైతం ఇసుక తీసి గుట్టలు పెడుతున్నారు. నిమిషాల్లో లారీల్లో లోడు చేసి తరలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంత పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నా పట్టించుకున్న నాథుడు లేరు. ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని కరుగోలుమిల్లి గ్రామస్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌, మైన్స్‌ అధికారులు, పర్యావరణ అధికారులకు అనేక సార్లు ఫిర్యాదులు చేశామని తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని