logo

ఆకాశంలో తెల్లటి చుక్క..ఆరా తీస్తే బుడగ

ఆకాశంలో తెల్లటి చుక్క అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన సంఘటన ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు ప్రాంతం జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెంలో చోటుచేసుకుంది. ఈ చుక్క గంటల తరబడి అక్కడే దర్శనమివ్వడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. సామాజిక

Published : 21 Jan 2022 05:20 IST

జీలుగుమిల్లి, న్యూస్‌టుడే: ఆకాశంలో తెల్లటి చుక్క అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన సంఘటన ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు ప్రాంతం జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెంలో చోటుచేసుకుంది. ఈ చుక్క గంటల తరబడి అక్కడే దర్శనమివ్వడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. సామాజిక మాధ్యమాల్లోనూ హల్‌చల్‌ చేసింది. ఏదో గ్రహశకలం భూమికి అత్యంత దగ్గరగా వచ్చిందంటూ వదంతలు చక్కర్లు కొట్టాయి. ఆరా తీస్తే ..తాటియాకులగూడెంలో కొంతమంది యువకులు బుధవారం ఓ ఇంటి మేడపై పెద్ద బుడగ (ప్యారాచూట్‌ బెలూన్‌) కట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో తాడు తెగడంతో ఆకాశంలోకి చాలా ఎత్తుకు వెళ్లిపోయింది. గురువారం ఉదయం కనిపించింది. సూర్య కిరణాలు బుడగపై పడగా తెల్లగా మెరుస్తూ అబ్బురపరిచింది. చివరికి విషయం తెలిశాక ఊపిరి పీల్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని