logo

‘తెదేపా ఎమ్మెల్యేలపై దాడి దుర్మార్గపు చర్య’

అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు తెదేపా ఎమ్మెల్యేలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేయి చేసుకోవడం దుర్మార్గపు చర్యని మదనపల్లె మాజీ ఎమ్మెల్యే,, తెదేపా  మదనపల్లె నియోజకవర్గ బాధ్యుడు దొమ్మలపాటి రమేశ్‌ అన్నారు.

Published : 22 Mar 2023 01:57 IST

అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న మాజీ ఎమ్మెల్యే రమేశ్‌, నాయకులు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు తెదేపా ఎమ్మెల్యేలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేయి చేసుకోవడం దుర్మార్గపు చర్యని మదనపల్లె మాజీ ఎమ్మెల్యే,, తెదేపా  మదనపల్లె నియోజకవర్గ బాధ్యుడు దొమ్మలపాటి రమేశ్‌ అన్నారు. అసెంబ్లీలో జరిగిన దాడిని ఖండిస్తూ మదనపల్లె పట్టణంలోని అంబేడ్కర్‌ కూడలిలో మంగళవారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలపై చేయి చేసుకోవడం రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ప్రథమమని, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు ప్రస్తావించినప్పుడు హుందాతనంతో వివరణ ఇవ్వాల్సింది పోయి చేయి చేసుకోవడం దారుణమన్నారు. తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపాకు పట్టం కట్టడం, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిపై అభియోగాలుండడం జీర్ణించుకోలేక ప్రజల దృష్టిని వాటి నుంచి మరల్చడానికి ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో తెదేపా పట్టణ అధ్యక్షుడు భవానీప్రసాద్‌, బీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధప్ప, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫి, తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మధుబాబు, నాయకులు నవీన్‌చౌదరి, శ్రీనివాసులు, నాగయ్య, చంద్ర, నరసింహులు, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని