logo

గిరిజనుల ఆందోళన

గిరిజనుల హక్కులను కాలరాసేందుకే ప్రభుత్వం బోయ, వాల్మీకి, బీసీ కులాలను గిరిజన జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అసెంబ్లీ ద్వారా సిఫార్సు చేసిందని గిరిజన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు సుధాకర్‌ రావు పేర్కొన్నారు.

Published : 28 Mar 2023 03:14 IST

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న గిరిజన సమాఖ్య నాయకులు

రాయచోటి, న్యూస్‌టుడే: గిరిజనుల హక్కులను కాలరాసేందుకే ప్రభుత్వం బోయ, వాల్మీకి, బీసీ కులాలను గిరిజన జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అసెంబ్లీ ద్వారా సిఫార్సు చేసిందని గిరిజన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు సుధాకర్‌ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడంతో ముందస్తుగా పోలీసులు కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వద్దనే వారిని అడ్డుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. కొందరు ఆర్‌జీఎస్‌ నాయకులు పోలీసుల కళ్లుగప్పి కలెక్టరేట్ ద్వారం వద్దకు చేరుకుని ఆందోళన కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 36 లక్షల మంది గిరిజనులు వైకాపా అధికారంలోకి రావడానికి కృషి చేశారని, గిరిజనుల ఓట్లు దండుకుని వారికే అన్యాయం చేసేందుకు ప్రభుత్వం పూనుకోవడం దారుణమన్నారు. అనంతరం వారంతా కలెక్టర్‌ గిరీషకు వినతి పత్రం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని