ధరలకు బెదిరి... ఆశలు చెదిరి!
ఏడాది పాటు కంటికిరెప్పలా కాపుగాసి పండించుకున్న పంట తీరా చేతికందే సమయంలో వాతావరణం ఒక వైపు, ధరలు, దళారులు మరోవైపు ముప్పేట దాడి చేయగా..
ఉర్లగట్టుపోడు-బంగ్లామిట్ట గ్రామాల సమీపంలో పారబోసిన మామిడికాయలు
ఏడాది పాటు కంటికిరెప్పలా కాపుగాసి పండించుకున్న పంట తీరా చేతికందే సమయంలో వాతావరణం ఒక వైపు, ధరలు, దళారులు మరోవైపు ముప్పేట దాడి చేయగా.. ఫలరాజును నమ్ముకున్న రైతులు వాటిని ఇలా రోడ్డు పక్కన మైదానాలలో పారబోస్తున్నారు. రైల్వేకోడూరు మార్కెట్ యార్డులో బేనీషా, రుమాణి, నాటు రకాల మామిడి కాయలు టన్ను రూ.15 వేలు కూడా దాటడం లేదు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో కాయలపై మచ్చలు రావడంతో వాటి ధరలు టన్ను రూ.5 వేల లోపే పలుకుతున్నాయి. దీంతో కనీసం కోత కూలీలు, రవాణా ఖర్చులకు కూడా రావట్లేదని రోడ్డు పక్కన పడేసి వెళ్తున్నారు. వాటిలో నాణ్యమైన కాయలను స్థానికులు ఏరుకుని పట్టుకెళ్తున్నారు.
న్యూస్‌టుడే, రైల్వేకోడూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TTD: సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
Weather Report: తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
Chandrayaan 3: జాబిల్లిపై సూర్యోదయం.. విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు ఇస్రో ప్రయత్నాలు
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Manipur: మణిపుర్లో మరోసారి ఉద్రిక్తతలు.. కర్ఫ్యూ సడలింపులు రద్దు!