Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం..

Published : 24 May 2021 12:55 IST

1. Krishnapatnam: ఆయుర్వేదంపై పరిశోధన ప్రారంభం

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద ముందు పనితీరుపై పరిశోధన ప్రారంభమైంది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీసీఆర్‌ఏఎస్‌) 4 దశల్లో ఆ మందును విశ్లేషించనుంది. మొదటి దశలో భాగంగా మందు తీసుకున్నవారి అభిప్రాయాలను సేకరించనుంది. దీనికి సంబంధించిన బాధ్యతలను విజయవాడలోని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన స్థానం, తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రికి సీసీఆర్‌ఏఎస్‌ అప్పగించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. AP Politics: తెదేపా నేతల గృహ నిర్బంధం

ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొవిడ్‌ బాధితులకు భరోసా కార్యక్రమానికి తెదేపా పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లోని కొవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతుండగా వారిని నిర్బంధించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. TS News: రైతుల‌ బాధ్య‌త సీఎంపై లేదా?

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వం యాసంగి పంట‌ల‌ను త‌క్ష‌ణ‌మే కొనుగోలు చేయాల‌ని భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతులకు సంబంధించి ఐదు డిమాండ్లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ భాజ‌పా..   రైతు గోస‌- భాజ‌పా పోరు దీక్ష‌ను చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. క‌ర్ష‌కుల‌ను ఆదుకోవాల్సిన క‌నీస బాధ్య‌త సీఎంపై లేదా? అని ప్ర‌శ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. Corona: మరింత తగ్గిన కొత్త కేసులు

దేశంలో ఆదివారం 19,28,127 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,22,315 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితంరోజుతో పోల్చితే స్వల్ప తగ్గుదల కనిపించింది. మరోవైపు, 24 గంటల వ్యవధిలో మరోసారి భారీగా మరణాలు సంభవించాయి. నిన్న 4,454 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు 2,67,52,447 మందికి కరోనా సోకగా..3,03,720 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌కు కారణం ఇదే..! 

కరోనా రోగుల్లో బ్లాక్‌ ఫంగస్‌ సమస్య తలెత్తడానికి కారణం స్టిరాయిడ్స్‌ను విచక్షణారహితంగా వినియోగించడమేనని పలువురు వైద్యనిపుణులు పేర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడో కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మహాత్మాగాంధీ స్మారక వైద్య కళాశాలలో మెడిసిన్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ వీపీ పాండే 210 మంది బ్లాక్‌ ఫంగస్‌ రోగులపై చేసిన అధ్యయన వివరాలను రాజీవ్‌ జయదేవన్‌ అనే వైద్యుడు ట్విటర్‌లో పెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. Narada Case: సుప్రీంకు సీబీఐ

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ తుపానుకు కారణమైన తృణమూల్‌ మంత్రుల అరెస్టు వ్యవహారం సుప్రీంకు చేరింది. ఈ కేసులో అరెస్టయిన టీఎంసీ మంత్రులు, మరో ఇద్దరు నేతలను గృహనిర్బంధంలో ఉంచాలన్న కోల్‌కతా హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ నలుగురు నేతల బెయిల్‌ పిటిషన్‌పై నేడు కోల్‌కతా హైకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ జరపనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. Wuhan lab: వుహాన్‌ ల్యాబ్‌లో ఎవరా ముగ్గురు..?

చైనాలోని వుహాన్‌ ల్యాబ్ విషయంలో మరో సంచలన వార్త బయటకు వచ్చింది. దీంతో వైరస్‌ ఇక్కడి నుంచే పుట్టుకొచ్చిందనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. అమెరికా ఇంటెలిజెన్స్‌ సంస్థల నివేదికల ఆధారంగా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఒక కథనాన్ని ప్రచురింది. ఇప్పటికే అణుశాస్త్రవేత్తల జర్నల్‌ ‘బులెటిన్‌.ఓఆర్‌జీ’లో కూడా ల్యాబ్‌ లీకేజీపై కథనం వచ్చి సంచలనం సృష్టించింది. వీటిల్లో వేటికి చైనా ఆధారాలు చూపించి ఖండించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. Sonu Sood: నా హృదయం ముక్కలయ్యేది

కరోనా కష్టకాలంలో అతడే ఒక సైన్యంలా మారి ఎంతోమంది బాధితుల ప్రాణాలు కాపాడుతున్నారు రియల్‌ హీరో సోనూసూద్‌. గతేడాది లాక్‌డౌన్‌ నుంచి సామాన్య ప్రజల కోసం నిర్విరామంగా శ్రమిస్తున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. గతేడాదిలో పోలిస్తే కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సరైన వసతుల్లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే.. అది చూసి తాను చలించిపోయినట్లు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. New Cars: భలే కారులొస్తున్నాయ్‌.. ఆగండి!

కార్ల మార్కెట్‌లో రాబోయే మూడు నెలలు చాలా ఆసక్తికరంగా ఉండబోతోందట. ఎందుంటే మార్కెట్‌లోకి  చాలా కొత్త కార్లు రాబోతున్నాయి. వాటిలో మారుతి, హ్యుందాయ్‌, మహీంద్రా, టాటా, ఫోక్స్‌వ్యాగన్‌, స్కోడాకు చెందిన కొత్త మోడళ్లు ఉండబోతున్నాయి. ఆ కార్ల గురించి తెలుసుకోవాలంటే పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

10. Team India: 10 మంది 10 కొట్టలేదు!

టీ20 క్రికెట్‌.. చాలా విచిత్రమైన ఆట! అప్పటికప్పుడు హీరోలుగా చేస్తుంది. క్షణాల్లో జీరోలుగా మారుస్తుంది. ఎంత పటిష్ఠమైన జట్టైనా కొన్నిసార్లు తేలిపోతుంది. భీకర బౌలింగ్‌ను ఊచకోత కోసే బ్యాట్స్‌మెన్‌ రెండంకెల స్కోరు చేయలేకపోతారు. టీమ్‌ఇండియాకూ ఇది తప్పలేదు. ఆసీస్‌పై 74కే ఆలౌటైన ఓ పోరులో 10 మంది బ్యాటర్లు 10 స్కోరును అందుకోలేకపోయారు తెలుసా! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని