Amaravati: ఏపీ హైకోర్టు వద్ద అమరావతి రైతుల సాష్టాంగ నమస్కారం..

రాజధాని అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అమరావతి పరిసర ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని పరిధిలోని గ్రామాల్లోని దీక్షా శిబిరాల వద్ద పెద్ద

Updated : 03 Mar 2022 15:17 IST

అమరావతి: రాజధాని అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అమరావతి పరిసర ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని పరిధిలోని గ్రామాల్లోని దీక్షా శిబిరాల వద్ద పెద్ద ఎత్తున రైతులు, మహిళలు సంబరాలు జరుపుకొంటున్నారు. తుళ్లూరు, వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం, మందడం తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. ఆనందోత్సాహాలతో బాణసంచా కాల్చారు. మరోవైపు హైకోర్టు వద్ద పలువురు రైతులు సాష్టాంగ నమస్కారం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ అభివృద్ధి చేయాలని కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు