AP Inter Results: ఏపీ ఇంటర్‌ ఫలితాలు.. విడుదల చేసిన మంత్రి బొత్స

ఏపీ ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.

Updated : 22 Jun 2022 14:47 IST

అమరావతి: ఏపీ ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మే 6 నుంచి 25 వరకు పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

కృష్ణా ఫస్ట్‌.. కడప లాస్ట్‌..

‘‘ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. మొదటి సంవత్సరంలో 2,41,599 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌లో 54 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండ్‌ ఇయర్‌లో 2,58,449 మంది ఉత్తీర్ణత కాగా.. 61 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఆగస్ట్‌ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

ప్రథమ సంవత్సరంలో బాలురు 49 శాతం, బాలికలు 60 శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో బాలురు 56 శాతం, బాలికలు 68 శాతం మంది పాస్‌ అయ్యారు. అత్యధికంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 75 శాతం ఉత్తీర్ణత నమోదవగా.. అత్యల్పంగా ఉమ్మడి కడప జిల్లాలో 55శాతం మంది పాసయ్యారు. ఈనెల 25 నుంచి జులై 5 వరకు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఆగస్ట్‌ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి’’ అని బొత్స వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని