Bhadradri: సీతమ్మకు బంగారు ఆభరణం వితరణ

శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కొలువైన సీతమ్మ వారికి భక్తులు బంగారు ఆభరణాన్ని బహూకరించారు.

Updated : 25 Mar 2024 20:28 IST

భద్రాచలం: భద్రాద్రిలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కొలువైన సీతమ్మ వారికి ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు ఆభరణాన్ని దాతలు బహూకరించారు. సోమవారం భద్రాచలానికి చెందిన భక్తులు వాసులు శంకర్రావు దంపతులు ఈ ఆభరణాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. దాని విలువ రూ. 2.25 లక్షలు ఉంటుందని దాతలు తెలిపారు. అనంతరం దాతలకు అర్చకులు వేదాశ్వీరాదం చేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని