Nagar kurnool: కలుషిత ఆహారం తిని 50మంది విద్యార్థినులకు అస్వస్థత

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని మన్ననూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 50 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. 

Published : 14 Sep 2023 22:01 IST

మన్ననూర్ (అమ్రాబాద్): నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని మన్ననూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 50 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం తిన్న తర్వాత వారంతా కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డారు. బాలికల పరిస్థితి గమనించిన పాఠశాల సిబ్బంది.. వారిని హుటాహుటిన మన్ననూరు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలలోని మొత్తం 300 మందిని ప్రత్యేక వాహనాల్లో అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం 10 మంది బాలికలకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఉండటంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. బాలికల పరిస్థితిని డీటీడీవో పర్యవేక్షిస్తున్నారు. 

పాఠశాలలో విద్యార్థినిలు అస్వస్థతకు గురైన సమయంలో హాస్టల్‌ వార్డెన్‌ లేకపోవడంతో విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులతో కలిసి శ్రీశైలం ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని