Top Ten News @ 9 AM

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు వేరు వేరు చోట్ల జరిగిన ఘటనల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కొలిరాడోలోని ఓ మొబైల్‌ హోం పార్క్‌లో పుట్టిన రోజు వేడుకల్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు. అక్కడికక్కడే ఆరుగురు

Published : 10 May 2021 08:58 IST

1. అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు వేరు వేరు చోట్ల జరిగిన ఘటనల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కొలిరాడోలోని ఓ మొబైల్‌ హోం పార్క్‌లో పుట్టిన రోజు వేడుకల్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు. అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందగా.. చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. అత్యవసర ప్రయాణానికి ఈ-పాస్‌

కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో అత్యవసరమై ప్రయాణించే వారి కోసం ఈ-పాస్‌ విధానాన్ని సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. అలాంటివారు ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్ల నుంచి తగిన అనుమతి పొందాలని సూచించారు. ఏ అవసరంపై వెళ్తున్నారో అందుకు సంబంధించిన పత్రాలు చూపాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. కుటుంబాలపై కాటు

ఆనందంగా సాగిపోతున్న కుటుంబాల్లో కరోనా పెను విషాదాన్ని నింపుతోంది. కొన్ని కుటుంబాల్లో కనీసం ఇద్దరు.. ముగ్గురు మరణిస్తున్నారు. అది కూడా.. కొన్ని గంటల వ్యవధిలోనే. ఒకరి అంత్యక్రియలు పూర్తయ్యాయో లేదో.. మరొకరి మరణ వార్త వినాల్సిన విషాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీనివల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఊపిరితో వ్యాపారం!

కరోనా విలయతాండవం చేస్తుండటంతో ప్రజల అవసరాన్ని, భయాన్ని సొమ్ము చేసుకుంటూ ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు విక్రయించే కంపెనీలు, డీలర్లు అడ్డగోలుగా ధరలు పెంచేశారు. సాధారణ రోజుల్లో రూ.30-40 వేలుండే ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ ధరని ఇప్పుడు రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు పెంచేశారు. ఇది నిమిషానికి ఐదు లీటర్ల సామర్థ్యం గల కాన్సంట్రేటర్‌ ధర మాత్రమే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలి: అసదుద్దీన్‌ ఒవైసీ

ఆసుపత్రుల్లో పడకలు, ప్రాణవాయువు కొరతతో అయినవారిని కోల్పోతున్న ప్రజలందరికీ ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. పార్లమెంటును, పాత్రికేయుల్ని ఎదుర్కొనేందుకు మోదీ భయపడుతున్నారంటూ ఒవైసీ ఆదివారం ట్వీట్‌ చేశారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానం గందరగోళంగా ఉన్నందున ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందించాలన్నారు.  దేశంలోని మిగతా కంపెనీలూ వ్యాక్సిన్లు తయారు చేసే విధానాన్ని అమలు చేయడం లేదేమని ప్రశ్నించారు.

6. బంధనంలోకి భారతం

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాలు యథాశక్తి కఠిన చర్యలు చేపడుతున్నాయి. లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలతో పాటు అనేక ఆంక్షలు విధించాయి. దిల్లీ, తమిళనాడు, రాజస్థాన్‌, పుదుచ్ఛేరి, హరియాణా, కేరళ, బిహార్‌, ఒడిశా, నాగాలాండ్‌లో లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా వివిధ రాష్ట్రాల్లో వారాంతపు లాక్‌డౌన్‌, లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు, కర్ఫ్యూలు విధించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. కరోనా వైరస్‌తో ఆయుధాలు!

కరోనా వైరస్‌తో ఆయుధాలను తయారు చేయడంపై 2015లోనే చైనా శాస్త్రవేత్తలు చర్చించారా? సార్స్‌ కరోనా వైరస్‌లు నూతన శకం జీవాయుధాలా? ఇప్పటికే మనుషుల్లో వ్యాధికారక వైరస్‌లోకి దీనిని కృత్రిమంగా చొప్పించి ఆయుధాలుగా మలచుకోవచ్చా?.. అవుననే అంటోంది ‘ది ఆస్ట్రేలియన్‌’ కథనం. మూడో ప్రపంచ యుద్ధం జరిగితే అది జీవాయుధాలతోనే అని చైనా శాస్త్రవేత్తలు, ఆరోగ్య అధికారులు ఒక పత్రంలో రాసినట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. మీ క్షేమమూ.. మాకు ముఖ్యమే

తమ ఉద్యోగులు, వారి కుటుంబాలు కరోనా బారిన పడకుండా ప్రముఖ ఐటీ పరిశ్రమలు కాపాడుకుంటున్నాయి.  ఒకవేళ పాజిటివ్‌గా నిర్ధారణ అయినా, ఆరోగ్య పరిస్థితి విషమించినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. ప్రత్యేకంగా క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఎల్లవేళలా వైద్యులు, అంబులెన్స్‌లు, ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉంచుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. నేర్చుకో.. తీర్చిదిద్దుకో!

గత కొన్నేళ్లుగా పెద్ద పరిశ్రమలన్నింటిలోకీ కృత్రిమ మేధ (ఏఐ) చొచ్చుకొని వచ్చేస్తుందని భావించడం ఎంత వాస్తవమో.. చిన్న సంస్థలు ప్రాథమిక సాంకేతికతను అందిపుచ్చుకోవడానికే సమయం పడుతుందనుకోవడమూ అంతే నిజం. కానీ ఈ పరిస్థితిలో కొవిడ్‌ పెను మార్పు తెచ్చింది. చిన్న, మధ్యతరహా అన్న తేడా లేకుండా ప్రతి సంస్థా డిజిటల్‌ నైపుణ్యాలను అందిపుచ్చుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. కోహ్లీసేన ఇంగ్లాండ్‌లో.. మరో జట్టు శ్రీలంకలో

ఇంగ్లాండ్‌లో టీమిండియా పర్యటన దాదాపు మూడున్నర నెలల పాటు కొనసాగనుంది. అయితే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు, జులైలో టీమ్‌ఇండియా టీ20, వన్డే సిరీస్‌ కోసం శ్రీలంకలో పర్యటించబోతుంది. ఇంగ్లాండ్‌లో ఉన్న కోహ్లీసేన.. మధ్యలో శ్రీలంకలో ఎలా పర్యటిస్తుంది అనే సందేహం తలెత్తడం సహజం. అయితే లంకకు వెళ్లబోయేది వేరే భారత జట్టు కావడమే ఇక్కడ విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* ఏఎఫ్‌సీ కప్‌లో కొవిడ్‌ కలకలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని