Medigadda Barrage: మేడిగడ్డను పరిశీలించిన ఎన్‌డీఎస్‌ఏ బృందం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మూడు బ్యారేజీలను పరిశీలించేందుకు వచ్చిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల బృందం రంగంలోకి దిగింది.

Published : 07 Mar 2024 10:41 IST

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మూడు బ్యారేజీలను పరిశీలించేందుకు వచ్చిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల బృందం రంగంలోకి దిగింది. బుధవారం రాత్రి హనుమకొండలో బస చేసిన అధికారుల బృందం గురువారం ఉదయాన్నే మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్లింది. చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం మొదటగా ఎల్‌ అండ్‌ టీ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత బ్యారేజీ వద్ద ఏడో బ్లాక్‌లో కుంగిపోయిన ప్రాంతం.. దిగువ భాగంలో ఏర్పడిన పగుళ్లను క్షుణ్నంగా పరిశీలించారు. గేట్ల సామర్థ్యం, కుంగుబాటుకు కారణాలపై ఈ కమిటీ పూర్తిగా అధ్యయనం చేయనుంది. ఇక్కడ పరిశీలన పూర్తి అయిన తర్వాత మధ్యాహ్నం అన్నారం, సుందిళ్ల బ్యారేజీలనూ కమిటీ పరిశీలించనుంది. పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల గడువు విధించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు