TTD: ఈ ఏడాది చివరి నాటికి గరుడవారధి నిర్మాణం పూర్తి: తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు..

Updated : 23 Sep 2022 11:16 IST

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా తిరుమలలో ఉన్న అన్ని ఉద్యానవనాలకు కొత్త శోభను తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. భక్తుల మనసంతా స్వామివారి కృపతో నింపాలని.. అందుకు అనుగుణంగా తిరుమలలోని ఉద్యానవనాలను రూ.60 లక్షలతో అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తితిదే అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 27న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారని చెప్పారు. తిరుమలలో అందుబాటులోకి తీసుకొచ్చిన నూతన పరకామణి భవనాన్ని సీఎం ప్రారంభిస్తారన్నారు. తిరుపతిలో శ్రీనివాస సేతు(గరుడ వారధి) నిర్మాణ పనులు ఏడాది ఆఖరి కల్లా పూర్తి చేస్తామని ప్రకటించారు. 2023 కొత్త ఏడాది నాటికి వారధి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. శ్రీనివాస సేతుతో తిరుపతి స్థానికులకు, భక్తులకు ట్రాఫిక్ సమస్యలు దూరమవుతాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని