icon icon icon
icon icon icon

ఏపీలో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్న 4,44,216 మంది ఉద్యోగులు

రాష్ట్ర వ్యాప్తంగా 4,44,216 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ వినియోగించుకున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు.

Published : 10 May 2024 20:31 IST

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 4,44,216 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ వినియోగించుకున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. మే 4 నుంచి నుంచి 9వ తేదీ వరకు 6 రోజుల పాటు పోస్టల్‌ ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగిందన్నారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో అత్యధికంగా 22,650 పోస్టల్ ఓట్లు నమోదు కాగా... అత్యల్పంగా అమలాపురం పార్లమెంటు పరిధిలో 14,526 ఓట్లు పోలైనట్లు తెలిపారు. పోలైన పోస్టల్‌ బ్యాలెట్లను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలిస్తున్నట్లు చెప్పారు. 

అనంతపురం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు సహా 14 నియోజకవర్గాల్లో వందశాతం వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఈవో పేర్కొన్నారు. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా 28 మోడల్‌ పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పల్నాడు సహా సున్నితమైన ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో రెండేసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఈవో కార్యాలయంతోపాటు అన్ని జిల్లాల్లోని కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా పోలింగ్‌ తీరును పర్యవేక్షిస్తామని ముకేశ్‌కుమార్‌ మీనా స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img